బిగ్ బ్రేకింగ్: హైకోర్టులో చంద్రబాబుకి ఊరట..!!

మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు కి ఇటీవల సిఐడి అధికారులు నోటీసులు ఇవ్వడం అందరికీ తెలిసిందే.దళితులకు చెందిన అసైన్డ్ భూములను అన్యాయంగా లాక్కుని ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసి భయబ్రాంతులకు గురి చేసి స్వాధీనం చేసుకున్నారని చంద్రబాబు అండ్ కో పై అధికార పార్టీకి చెందిన నాయకులు సిఐడి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం జరిగింది.

 High Court Gave Stay To Cid Investigation On Chandrababu , Chandrababu, High Cou-TeluguStop.com

దీంతో చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తమ పై సిఐడి నమోదుచేసిన ఎఫ్ఐఆర్ సరికాదు అంటూ హైకోర్టులో క్యాష్ పిటిషన్ వేశారు.నేడు విచారణకు వచ్చిన ఈ పిటిషన్.

చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ క్రిమినల్ లాయర్ సిద్ధార్థ్ లుధ్ర వాదనలు వినిపించగా.మాజీ మంత్రి నారాయణ తరఫున హైకోర్టు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

చట్టాల పై అదేవిధంగా ప్రభుత్వం జారీ చేసిన జీవోలు పై దర్యాప్తు చేసే అధికారం పోలీసులకు లేదని కేసు పెట్టాలంటే.ఫిర్యాదుదారుడు దళిత వర్గానికి చెందిన వాడై ఉండాలని, కావాలని ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో తప్పుడు కేసులు పెట్టిందని, సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సరైనది కాదని క్వాష్ పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు .ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ భూషణ్ వాదనలు వినిపించడం జరిగింది.ఇలాంటి తరుణంలో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు సీఐడీ విచారణ పై స్టే ఇచ్చింది.ఈ పరిణామంతో చంద్రబాబు తో సహా నారాయణ ఈ సిఐడి కేసులో విచారణకు హాజరు కావాల్సిన పనిలేకుండా ఊరట లభించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube