బిగ్ బ్రేకింగ్: యధాతధంగా ఏలూరులో ఎన్నికలు..!!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేయడం అందరికీ తెలిసిందే.ఇలాంటి తరుణంలో నిన్న ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా హైకోర్టు కొట్టివేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు యధాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది.

 Big Breaking Eluru Elections To Be Held As Usual , West Godavari,eluru,high Cou-TeluguStop.com

హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.ఏలూరు చుట్టుపక్కల 7 గ్రామాల విలీనం ఎప్పుడు జరిగింది.

అయితే గ్రామాల పరిధిలో చాలా మంది ఓటర్లను .ఏలూరు వోటర్ లిస్టు లో కలపలేదు అంటూ ఆయా గ్రామాలకు చెందిన 33 మంది హైకోర్టులో పిటిషన్ వేశారు.అయితే ఈ పిటిషన్ పై హైకోర్టు సింగిల్ బెంచ్ ఏలూరు ఎన్నికలను నిలిపివేస్తూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది.ఈ తరుణంలో ఎన్నికల కమిషన్ కోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది.

ఏలూరులో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఈ సమయంలో ఎన్నికలు ఆపితే .సాంకేతిక ఇబ్బందులు వస్తాయి అంటూ వాదనలు వినిపించింది.దీంతో వాదనలు విన్న హైకోర్టు ఎన్నికలు నిర్వహించుకోవచ్చు కాకపోతే కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube