బిగ్‌బాస్‌ 2.. రెండు విషయాల్లో మేం చెప్పిందే జరిగింది       2018-06-17   22:20:09  IST  Raghu V

భారీ అంచనాల నడుమ ప్రారంభం అయిన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2 మొదటి వారం పూర్తి చేసుకుంది. హౌస్‌లో సెలబ్రెటీలు లేరని, ఇంట్లో ఉన్న వారు పెద్దగా ఎంటర్‌టైన్‌ చేయలేక పోతున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బిగ్‌బాస్‌ 2 మొదటి వారంలో ఎలిమినేషన్‌ జరిగింది. షో ప్రారంభం అయిన రెండవ రోజునే బిగ్‌బాస్‌ మొదటి వారం ఎలిమినేషన్‌ జాబితాలో సంజన ఉంటుందని మేం చెప్పాం. ఆ తర్వాత కూడా ఎలిమినేషన్‌లో ఉన్న వారందరిలో కూడా సంజన కాస్త అతిగా ప్రవర్తిస్తుందని, ఆమెకు ప్రేక్షకుల మద్దతు దక్కడం కష్టమే అంటూ తాము విశ్లేషించాం. తాము చెప్పిట్లుగానే నిన్న ఎలిమినేషన్‌ ద్వారా సంజన బయటకు వచ్చేసింది.

ఇంట్లో ప్రతి ఒక్కరితో కూడా గొడవ పడుతూ మాట్లాడటం, ప్రతి ఒక్కరి గురించి కూడా చెడుగా మాట్లాడటం వంటివి చేసిన సంజనను ప్రేక్షకులు పెద్దగా కోరుకోలేదు. ఎలిమినేషన్‌లో ఉన్న వారిలో దీప్తి సునైనకు భారీగా ఓట్లు రావడం జరిగింది. దాంతో ఆమెను మొదటే సేఫ్‌ అంటూ ఎన్టీఆర్‌ ప్రకటించాడు. సంజన విషయంలో ప్రేక్షకులు ఆసక్తి చూపించక పోవడంతో బిగ్‌బాస్‌ ఇంటి నుండి ఆమె మొదటి వారంలోనే బయటకు వచ్చేసింది. ఇంట్లో అందరితో కలిసి పోయినట్లుగా ఉండటంతో పాటు, అందరితో సరదాగా ఉండే వారికి ఓట్లు దక్కుతాయని సంజన ఉదంతం నిరూపించింది.

బిగ్‌బాస్‌ సీజన్‌ 2 ఆరంభం సమయంలోనే తాము మరో విషయాన్ని చెప్పుకొచ్చాం. అదేంటి అంటే రెండవ వారంలోనే వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతుందని మేం చెప్పుకొచ్చాం. ప్రగ్యా జైస్వాల్‌ అంటూ ప్రచారం జరిగినప్పటికి, మేం మాత్రం మరో సెలబ్రెటీని బిగ్‌బాస్‌ హౌస్‌లోకి రెండవ వారం నుండి పంపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాం. మేం చెప్పినట్లుగానే నాని బిగ్‌బాస్‌ 2 హౌస్‌లోకి కొత్త పార్టిసిపెంట్‌ను పంపబోతున్నట్లుగా ప్రకటించాడు. ఆ పార్టిసిపెంట్‌ను కూడా పరిచయం చేశాడు. నేడు ఆమె ఇంట్లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది. మొదటి రోజే ఆమె బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వాల్సి ఉన్నా కూడా చిన్న యాక్సిడెంట్‌ కారణంగా ఆమె వెళ్లలేదు. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చే వారు కాస్త స్టార్‌ అయ్యి ఉంటారని అనుకున్నాం. కాని ఈమె కూడా సాదా సీదా సెలబ్రెటీనే అని తేలిపోయింది.

మొత్తానికి రోజులు గడుస్తున్నా కొద్ది ఆసక్తికరంగా మారుతూ ముందుకు సాగిపోతుంది. నేటి నుండి షో మరికాస్త ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. బాబు గోగినేనికి ఎలిమినేషన్‌ అయిన సంజన బిగ్‌బాంబ్‌ పనిష్మెంట్‌ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ పనిష్మెంట్‌ను బాబు గోగినేని వారం రోజుల పాటు కొనసాగించాల్సి ఉంటుంది. ఇంట్లో ఏ ఒక్కరికి వాటర్‌ కావాలి అన్నా కూడా బాబు గోగినేని ఫిల్టర్‌ వద్దకు వెళ్లి వాటర్‌ తీసుకు రావాల్సి ఉంటుంది. ఇది కాస్త ఆసక్తికర విషయంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో ప్రతి ఒక్కరికి బాబు గోగినేని అంటూ గౌరవం ఉంది. ఇలాంటి సమయంలో ఆయన్ను ఎలా వాటర్‌ అడుగుతారో అనే విషయం ఆసక్తికరంగా ఉంది.