క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన బిగ్ బాస్ టీమ్  

Big Boss Team File A Quash Petition In High Court-

మా టీవీ లో విజయవంతంగా రెండు సీజన్స్ ను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో మూడో సీజన్ లో మాత్రం చాలా వివాదాలను ఎదురుకుంటుంది.ఇంకా ఈ షో ప్రసార మాధ్యమాల్లో రాకముందే వివాదాలకు నెలవైపోయింది.ఇప్ప‌టికే ఈ షో ఆపేయాలంటూ కొంద‌రు...

Big Boss Team File A Quash Petition In High Court--Big Boss Team File A Quash Petition In High Court-

కాస్టింగ్ కౌచ్ ఉంద‌ని మ‌రికొంద‌రు.అశ్లీల‌త ఉంద‌ని ఇంకొంద‌రు ఎవ‌రికి తోచింది వాళ్లు చేస్తున్నారు.దీనితో అసలు ఎలాంటి స్టెప్ తీసుకోవాలో అన్న కన్ఫ్యూజన్ లో బిగ్ బాస్ టీమ్ ఉండిపోయింది.

Big Boss Team File A Quash Petition In High Court--Big Boss Team File A Quash Petition In High Court-

గత కొద్ది రోజులుగా బిగ్‌బాస్-3 పై చాలా రభస జరుగుతోంది.మొదట యాంకర్ శ్వేతారెడ్డి బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, అనంతరం నటి గాయత్రీ గుప్తా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

తమ పట్ల బిగ్‌బాస్ షో నిర్వాహకులు అసభ్యంగా వ్యవహరించారంటూ వేరువేరుగా వీరు ఫిర్యాదు చేశారు.దీంతో.బంజారాహిల్స్ పీఎస్‌లో నలుగురు బిగ్ బాస్ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే..

దీనితో బిగ్ బాస్-3 పై ఈ సారి చాలా చాలా రచ్చ కొనసాగుతుంది.దీనితో ఇలా అయితే షో నిర్వహణ కష్టం అనుకున్న మాటీవీ బిగ్ బాస్ కో ఆర్డినేషన్ టీమ్ హై కోర్టును ఆశ్ర‌యించింది.త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ కోర్టు లో క్వాష్ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది.

యాంక‌ర్ శ్వేతా రెడ్డి, న‌టి గాయ‌త్రి గుప్తాలు త‌మ షోపై బంజారా హిల్స్, రాయ‌దుర్గం కేసులు కొట్టివేయాల‌ని కోరుకుంటూ హై కోర్టును ఆశ్ర‌యించారు బిగ్ బాస్ టీం.అస‌లు అందులో ఎలాంటి నిజాలు లేవంటున్నారు వాళ్లు.