బిగ్ బాస్ 3 కి రంగం సిద్ధం! కంటిస్టెంట్స్ గా హాట్ యాంకర్స్  

బిగ్ బాస్ సీజన్ 3 కోసం కంటిస్టెంట్ లని ఫైనల్ చేస్తున్న నిర్వాహకులు. .

Big Boss Team Concentrate On Contestants For Big Boss 3-big Boss Team Concentrate,contestants For Big Boss 3,jabardasth Anchors,rashmi Gautham,star Maa,tollywood

తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్స్ పూర్తి చేసుకొని మూడో సీజన్ లోకి అడుగు పెడుతుంది. గత సీజన్ కి నాని వాఖ్యతగా వ్యవహరించగ, మొదటి షో కంటే రసవత్తరంగా ఎక్కువ వివాదాలతో నడిచింది. కౌశల్ విన్నర్ అయిన రెండో సీజన్ లో అతని ఆర్మీ హవా నడిచింది..

బిగ్ బాస్ 3 కి రంగం సిద్ధం! కంటిస్టెంట్స్ గా హాట్ యాంకర్స్-Big Boss Team Concentrate On Contestants For Big Boss 3

అయితే రెండో సీజన్ ని ఆడియన్స్ ఇప్పటికే మరిచిపోయారు. ఇప్పుడు సీజన్ 3 కి నిర్వాహకులు రంగం సిద్ధం చెసుకున్నారు. ఈ సీజన్ కోసం మొత్తం 20 మందితో కంటెస్టెంట్స్ జాబితా అయితే రెడీ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సారి కంటిస్టెంట్ లుగా భాగా గుర్తింపు ఉన్న స్టార్స్ ని రంగంలోకి దించుతున్న బిగ్ బాస్ టీం అందులో హాట్ యాంక‌ర్ల పేర్లు కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ర‌ష్మి, ఉద‌య‌భాను, ఝాన్సీ, లాస్య‌ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి.

మేల్ యాంకర్స్ లో ప్ర‌దీప్‌, ర‌వి ఇద్ద‌రిలో ఒక‌రు ఉంటార‌ని టాక్. ఈ సారి జ‌బ‌ర్ద‌స్త్ నుంచి ఇద్ద‌రిని బిగ్ బాస్ కంటిస్టెంట్ లుగా తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ ని మళ్ళీ ఎన్టీఆర్ వాఖ్యతగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తుంది.