ఒకే బెడ్ పై కనిపించిన దీప్తి మరియు షణ్ముఖ్... లవ్ కన్ఫర్మ్ అయినట్లేనా..?

తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రముఖ రియాల్టీ గేమ్ షో బిగ్ బాస్ 2వ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని బాగానే ఫేమస్ అయినటువంటి “దీప్తి సునైనా” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే దీప్తి సునైనా మొదట్లో డబ్ స్మాశ్, టిక్ టాక్ వంటి ఎంటర్టైన్మెంట్ యాప్స్ లో నటన, డ్యాన్స్ సంబంధిత వీడియోలను షేర్ చేస్తూ బాగానే పాపులర్ అయ్యింది.

 Big Boss Show Fame Deepthi Sunaina And Shanmukh Photos Viral-TeluguStop.com

అందువల్లే బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం కూడా దక్కించుకుంది.ఆ తర్వాత ఈ అమ్మడు కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశించినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకపోయింది.

కాగా ఇటీవలే దీప్తి సునైనా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో హాట్ టాపిక్ గా మారింది.

 Big Boss Show Fame Deepthi Sunaina And Shanmukh Photos Viral-ఒకే బెడ్ పై కనిపించిన దీప్తి మరియు షణ్ముఖ్… లవ్ కన్ఫర్మ్ అయినట్లేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ఫోటోలో దీప్తి సునైనా యూట్యూబ్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ ద్వారా బాగా పాపులర్ అయిన షణ్ముఖ్ జస్వంత్ తో కలిసి ఒకే బెడ్ పై కనబడింది.

దీంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలని సోషల్ మీడియా మాధ్యమాలను షేర్ చేస్తూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా గత కొద్దికాలంగా దీప్తి సునైనా మరియు షణ్ముఖ్ జస్వంత్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని అందువల్లనే వీరిద్దరూ ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారని కూడా కామెంట్లు చేస్తున్నారు.

కానీ ఇప్పటి వరకు తమ ప్రేమ వ్యవహార విషయంపై దీప్తి సునైనా గాని లేదా షణ్ముఖ్ జస్వంత్ గాని స్పందించలేదు.దీంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లు వినిపిస్తున్న వార్తలపై నిజమెంతుందనే విషయం తెలియాల్సి ఉంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య కాలంలో దీప్తి సునైనా పలు టెలివిజన్ ఛానళ్లలో ప్రసారమయ్యే షోలు, ఈవెంట్లలో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.ఇక షణ్ముఖ్ జస్వంత్ విషయానికొస్తే సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకోవడంతో ప్రస్తుతం “సూర్య” అనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు.

ఈ వెబ్ సిరీస్ కూడా ప్రేక్షకులని బాగానే అలరిస్తోంది.దీంతో సాఫ్ట్ వేర్ డెవలపర్  వెబ్ సిరీస్ కి సీక్వెల్ ను కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

#DeepthiSunaina #BigBoss #Deepthi Sunaina #Big Boss #DeepthiSunaina

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు