మళ్లీ ఎన్టీఆర్‌ అవసరం రాకపోవచ్చు, మీరేమంటారు?

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 పూర్తి అయ్యి నెల అయ్యిందో లేదో అప్పుడే సీజన్‌ 4కు సంబంధించిన వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.గత కొన్ని రోజులుగా సీజన్‌ 4 కోసం స్టార్‌ మాటీవీ వారు షో నిర్వాహకులు ఎన్టీఆర్‌తో చర్చలు జరుపుతున్నారని, భారీ పారితోషికం ఆఫర్‌ చేసి టెంమ్ట్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

 Big Boss Season Four Host Is Ntr-TeluguStop.com

నాగార్జున హోస్ట్‌గా ఆకట్టుకున్నాడు.అయినా కూడా ఎందుకో ఎన్టీఆర్‌ను తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఎన్టీఆర్‌ మొదటి సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించాడు.కనుక ఆయన్నే మళ్లీ తీసుకు వస్తే ఖచ్చితంగా నాల్గవ సీజన్‌ మళ్లీ ఓ రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంటుందనే నమ్మకంతో స్టార్‌ వారు ఉన్నారు.

అందుకే ఎన్టీఆర్‌ను సంప్రదిస్తున్నారు.కాని ఎన్టీఆర్‌ ప్రస్తుత పరిస్థితుల్లో రాకపోవచ్చు.ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చేసే పనిలో ఉన్నాడు.అప్పటి వరకు ఆ సినిమా అయిపోవచ్చు.

ఆ తర్వాత కొత్త సినిమాను ప్రారంభిస్తాడు.కనుక బిగ్‌బాస్‌పై ఎన్టీఆర్‌ ఆసక్తి చూపించడనే వార్తలు వస్తున్నాయి.

ఎన్టీఆర్‌ అక్కర్లేదని మూడవ సీజన్‌కు నాగార్జున బాగానే హోస్టింగ్‌ చేశాడని, మళ్లీ మళ్లీ హోస్ట్‌లను మార్చాల్సిన అవసరం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube