తగ్గేదే లేదంటున్న తెలుగు బిగ్‌బాస్‌  

Telugu Big Boss Working Days Update, Big Boss Season 4, Nagarjuna, 120 Working Days, Coronavirus, Big Boss Add Shooting - Telugu 120 Working Days, Big Boss Add Shooting, Big Boss Season 4, Coronavirus, Nagarjuna

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 అధికారిక ప్రకటన వచ్చింది.కరోనా అనుమానాల నేపథ్యంలో బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ను ప్రారంభిస్తున్నారు.

TeluguStop.com - Big Boss Season 4 Nagarjuna 120 Working Days Coronavirus

Source:TeluguStop.com

తమిళ బిగ్‌బాస్‌ మేకర్స్‌ వెనుకంజ వేసినా కూడా తెలుగు నిర్వాహకులు మాత్రం ఏం భయం లేదు అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు.ఈ నెల చివరి నుండి షో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

TeluguStop.com - తగ్గేదే లేదంటున్న తెలుగు బిగ్‌బాస్‌-Movie-Telugu Tollywood Photo Image

నాగార్జునపై యాడ్స్‌ చిత్రీకరణ జరిగింది.అవి నేడో రేపో ప్రసారం కాబోతున్నాయి.ఇక వెంటనే కంటెస్టెంట్స్‌ మొదట హోం క్వారెంటైన్‌కు వెళ్లబోతున్నారు.రెండు వారాల తర్వాత షో ప్రసారం ప్రారంభం అవ్వబోతుంది.

కరోనా కారణంగా బిగ్‌బాస్‌ను 60 నుండి 70 రోజులు మాత్రమే నిర్వహించాలని మేకర్స్‌ భావిస్తున్నారు అంటూ వార్తలు వచ్చాయి.కాని విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏమాత్రం తగ్గకుండా వంద రోజులకు పైగానే షోను నిర్వహించబోఉన్నారు.

వంద రోజులు అంటూ ప్రకటించినా ఎక్కువగానే ఉంచబోతున్నారు.సీజన్‌ రెండు మరియు మూడులు చెప్పిన రోజుల కంటే రెండు వారాలు అధికంగానే ఉంచారు.

కనుక ఈసారి కూడా కనీసం నాలుగు నెలలు అంటే 120 రోజులు బిగ్‌బాస్‌ సాగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

తెలుగు బిగ్‌బాస్‌ హోస్ట్‌గా నాగార్జునకు మంచి పేరు వచ్చింది.

కనుక ఆయన్నే కంటిన్యూ చేస్తున్నారు.ఇక కంటెస్టెంట్స్‌ విషయంలో గడచిన మూడు సీజన్‌ల్లో కూడా అసంతృప్తి ఉంది.

కనుక దాన్ని పోగొట్టేందుకు ఈసారి హేమాహేమీలను రంగంలోకి దించాలని ప్రయత్నాలు జరిగాయి.మరి మేకర్స్‌ ఎవరిని పట్టుకున్నారో తెలియాల్సి ఉంది.

ఎన్నో పుకార్లు వచ్చినా అధికారికంగా మాత్రం ఒక్క పేరు కూడా బయటకు రాలేదు.షో ప్రారంభం రోజే ఆ విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

#Coronavirus #BigBoss #Nagarjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Boss Season 4 Nagarjuna 120 Working Days Coronavirus Related Telugu News,Photos/Pics,Images..