మాజీ ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఫిర్యాదు చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్  

Big Boss Contestant Case Filed Against Ex Mla Son-big Boss Contestant Sanjana,nithish Goud,ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు

బిగ్ బాస్-2 కంటెస్టెంట్ సంజన మాజీ ఎమ్మెల్యే కుమారుడి పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.అర్ధరాత్రి ఒంటరిగా ఉన్న తనపై పఠాన్ చెరువు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అని,అంతేకాకుండా తనపై దాడికి కూడా దిగినట్లు తన ఫిర్యాదులో పేర్కొంది.

Big Boss Contestant Case Filed Against Ex MLA Son-Big Sanjana Nithish Goud ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించాడు

శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్ లో తన స్నేహితురాలితో కలిసి నిలబడి ఉండగా ఆశిష్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని,తన పై దాడికి దిగి, బిల్డింగ్ పై నుంచి కిందకు తోయడానికి కూడా ప్రయత్నించాడని పేర్కొంది.అయితే ఈ సంఘటనను పలువురు చూస్తున్నా కూడా ఎవరూ కూడా అడ్డుకోలేదని, కనీసం బౌన్సర్లు కూడా తనకు సాయంగా రాలేదు సరికదా అతడికే సపోర్టుగా నిలిచారు అంటూ సంజనా ఆవేదన వ్యక్తం చేసింది.

హోటల్ యాజమాన్యం కూడా అతడిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.అసలు వివరాల్లోకెళ్తే.స్నేహితులతో కలిసి మా దాపూర్ హైటెక్స్‌లోని ఆర్టిస్ట్రీ పబ్‌కు వెళ్లిన సినీనటి, ఆమె స్నేహితురాండ్లు ఓ పక్కన నిలబడి సంగీతాన్ని వింటున్నారు.అప్పటికే మద్యంమత్తులో జోగుతున్న ఆశిష్‌గౌడ్, అతని మిత్రులు వారి వద్దకొచ్చి చేతులు పట్టి లాగారు.

అంతటితో ఆగకుండా ఆశిష్‌గౌడ్ తీవ్ర పదజాలంతో ఆ యువతులను దుర్భాషలాడటంతోపాటు చేతిలో ఉన్న గ్లాసును నేలకేసి కొట్టి బెదిరించాడు.అయితే ఈ తతంగాన్ని చూస్తున్న బౌనర్లు సైతం ఆశిష్ కు వంత పాడుతూ అక్కడ ఉన్న యువతులను అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటూ హొంకరించారు.

ఆశిష్‌గౌడ్ దుశ్చర్యతో తీవ్ర మనోవేదనకు గురైన సంజనా వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.

దీంతో ఆశిష్‌గౌడ్‌తోపాటు మరో ఇద్దరు నిందితులపై ఐపీసీ 354.354ఏ, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేసుకొని ఆ పబ్‌లోని సీసీ కెమేరాల వీడియో ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని పట్టుకొంటామని మాదాపూర్ పోలీసులు తెలిపారు.

అయితే గతంలో కూడా ఆశిష్ ఇలాంటి పలు దుశ్చర్యలకు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు.

తాజా వార్తలు