విమర్శలపై గట్టి సమాధానం ఇచ్చిన బిగ్ బాస్ దివి..?

బిగ్ బాస్ బ్యూటీ, నటి దీవి ప్రస్తుతం ఓ రేంజ్ లో గుర్తింపు సొంతం చేసుకుంది.బిగ్ బాస్ ముందు వెండితెరపై నటించిన దివి గురించి ఎవరికి తెలియదు.

 Bigg Boss, Divi Vadthya, Comments, Web Series,latetst  Tollywood  News-TeluguStop.com

కానీ బిగ్ బాస్ తర్వాత మాత్రం సెలబ్రిటీగా మారింది ఈ బ్యూటీ.తన సొట్ట బుగ్గల అందాలతో యువత మనసులను దోచుకుంది.

ఇక ప్రస్తుతం వరుస ఆఫర్ లను కూడా సొంతం చేసుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోలతో అందర్నీ ఫిదా చేస్తుంది.

ఇదిలా ఉంటే తనపై విమర్శలను అసలు పట్టించుకోను అంటుంది దివి.

Telugu Bigg Boss, Divi Vadthya, Web-Movie

ఇటీవలే ఈ బ్యూటీ హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ టైటిల్ ను కూడా గెలుచుకుంది.అంతేకాకుండా ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే.ఇక సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నగా కొన్ని విషయాలు పంచుకుంది.బిగ్ బాస్ ఎంట్రీ తనకు మంచి గుర్తింపు అందించిందని తెలిపింది.

తనకు గ్లామర్ ప్రపంచంలో గుర్తింపు రాలేదని, మోస్ట్ డిజైరబుల్ టైటిల్ గెలుచుకున్న కూడా తను షాక్ అయ్యానని తెలిపింది.ఇక ఆనందం తట్టుకోలేకపోయాను అంటూ పేర్కొంది.

ఇక తనకు నటనపై ఆసక్తి ఉండటంతో ఆడిషన్స్ వెళ్ళిన ప్రతిసారి రిజెక్ట్ అయ్యేదట.అలా వందకు పైగా ఆడిషన్స్ లో తనను రిజెక్ట్ చేశారట.అలా చేయటంతో మరింత స్ట్రాంగ్ అయ్యానని తెలిపింది.మహర్షితో పాటు పలు సినిమాలలో తాను నటించగా తనకు ఎవరూ తెలియదని తెలిపింది.

కానీ ఇప్పుడు మాత్రం అందరికీ పరిచయమంటూ.పైగా తనకు పెద్ద సినిమాలు, హీరోలతో నటించే అవకాశాలు వస్తున్నాయని ఇది సంతోషకరమైన విషయమని తెలిపింది.

Telugu Bigg Boss, Divi Vadthya, Web-Movie

ఇక తను చిరంజీవితో మరో మూడు నెలలో షూటింగ్ లో జాయిన్ అవ్వనుందట.ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నానని.కష్టపడితే ఫలితం వస్తుందని తెలిపింది.ఇక ఇటీవల ఈ బ్యూటీ యూట్యూబ్ ప్రైవేట్ సాంగ్ చిలక ముక్కు దానా తో మంచి సక్సెస్ అందుకుంది.అంతేకాకుండా 1.7 మిలియన్స్ కు పైగా వ్యూస్ కూడా వచ్చాయి.ఇదిలా ఉంటే ఈ పాటలో డాన్స్ సరిగ్గా చేయలేదంట విమర్శలు ఎదురయ్యాయి.ఈ నేపథ్యంలో వాటి గురించి స్పందిస్తూ.ఈ పాట కోసం, డాన్స్ కోసం తను ఎంత కష్టపడిందో తనకే తెలుసని, ఇంత కష్టం తానెప్పుడు పడలేదని తెలిపింది.పైగా తనకు మోకాలి నొప్పులు వచ్చినా కూడా తట్టుకొని డాన్స్ చేసిందట.

ఇక తన డాన్స్ పై వస్తున్న విమర్శలను పట్టించుకోనంటూ.అలాంటి వారికి ఈ పాట సాధించిన విజయం వ్యూస్ సమాధానమని తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube