ఆగస్టులో ఓకే కాని... బిగ్‌బాస్‌ టీంకు కండీషన్‌ పెట్టిన నాగార్జున

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 కు కరోనా అడ్డంకిగా మారింది.మంచి జోరు మీదున్న బిగ్‌ బాస్‌ షో నిర్వాహకులు తెలుగు మరియు తమిళంలో ఒకటి రెండు వారాల గ్యాప్‌ లో షూటింగ్‌ను మొదలు పెట్టాలనుకున్నారు.

 Nagarjuna Give The Strict Condition To Big Boss Team, Nagarjuna, Big Boss, Coron-TeluguStop.com

అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలో బిగ్‌బాస్‌ సీజన్‌ 4 ప్రారంభం అయ్యేది.కాని పరిస్థితులు అందుకు అనుకూలించడం లేదు.

తెలుగు బిగ్‌బాస్‌ 4 కు ఏర్పాట్లు అయితే పూర్తి అయ్యాయి కాని ఆగస్టు చివరి వరకు వెయిట్‌ చేయాలంటూ నాగార్జున సూచించాడు.

కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో ఖచ్చితంగా బిగ్‌బాస్‌ షో ప్రారంభించడం అనేది చాలా పెద్ద సాహస నిర్ణయం.

ఒక్కరికి ఏమైనా అనారోగ్యం చేసినా కూడా షో నిర్వాహకులు మరియు హోస్ట్‌ ఇలా అందరికి కూడా ఇబ్బందులు తప్పవు.అందుకే నాగార్జున ఆగస్టులో కరోనా కేసులు తగ్గుముఖం పడితే తప్పకుండా షో కు వెళ్దామని హామీ ఇచ్చాడట.

పరిస్థితి ఇలాగే ఉంటే మాత్రం ఆగస్టులో షో ను ముందుకు తీసుకు వెళ్లడం సాధ్యం కాదని అన్నాడట.

Telugu Big Boss, Big Boss Show, Coronavirus, Maa Tv, Nagarjuna-

ఆగస్టులో షో ను నిర్వహించేందుకు నిర్వాహకులు మాత్రం సర్వం సిద్దం చేస్తున్నారు.ఇప్పటికే కంటెస్టెంట్స్‌తో ఒప్పందం చేసుకున్నారు.మరో వైపు బిగ్‌బాస్‌ సెట్‌ నిర్మాణం పూర్తి చేస్తున్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో ఇప్పటికే ఉన్న సెట్టింగ్‌ కు మెరుగులు దిద్దుతున్నారు.ప్రొడక్షన్‌ టీం టాస్క్‌లకు సంబంధించి చర్చలు జరుపుతున్నారు.

ఇలా మొత్తానికి బిగ్‌ బాస్‌ ఏర్పాట్లు జరుగుతున్నాయి.కాని నాగ్‌ పెట్టిన కండీషన్‌ వారికి ఆందోళన కలిగిస్తుంది.

ఆగస్టు లేదా సెప్టెంబర్‌ లో వ్యాక్సిన్‌ వస్తే బాగుండు అన్నట్లుగా అంతా ఎదురు చూస్తున్నారు.వ్యాక్సిన్‌ వచ్చే వరకు కేసులు తగ్గవు.

వ్యాక్సిన్‌ వచ్చేది ఎప్పుడో బిగ్‌బాస్‌ వచ్చేది ఎప్పుడో అంటూ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube