బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోయేది వీళ్ళేనా  

Big Boss Consistents List Viral In Social Media-big Boss Consistents List,star Maa,tollywood,viral In Social Media

తెలుగు బిగ్ బాస్ షోకి రంగం సిద్ధం అయిపొయింది. నేడు అన్నపూర్ణ స్టూడియో లో చాలా గ్రాండ్ గా బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభం కాబోతుంది. అయితే ఇదివరకటి లాగా భారీ ప్రచార ఆర్బాటం లేకుండా బిగ్ బాస్ షో ని కేవలం యాడ్స్ ద్వారా ప్రచారం చేసి మొదలుపెట్టేస్తున్నారు. ఇక ఈ సీజన్ కి నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే..

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోయేది వీళ్ళేనా-Big Boss Consistents List Viral In Social Media

ఇప్పటికే బిగ్ బాస్ షో చుట్టూ వివాదాలు చుట్టు ముట్టి కాస్తా గందరగోళంగా ఉంది. ఓయూ జేఏసి అన్నపూర్ణ స్టూడియో వద్ద ఆందోళన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో షోని సైలెంట్ గా మొదలుపెట్టేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్లు వీరే అంటూ అందరి పేర్లు బయటకి వచ్చాయి.ఇప్పుడు వారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోయే వారు నటి హేమ, యాంకర్ శ్రీముఖి, తీన్మార్ సావిత్రి, నటి హిమజా రెడ్డి, నటుడు వరుణ్ సందేశ్-వితికా షెరు(జంట), సీరియల్ నటుడు రవికృష్ణ, సీరియల్ యాక్టర్ అలీ రెజా, టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్, నటి పునర్వీ భూపాలం, కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, యూట్యూబ్ కామెడీ స్టార్ మహేశ్ విట్టా, సీరియల్ నటి రోహిణి, డబ్‌స్మాష్ స్టార్ అశు రెడ్డి (జూనియర్ సమంత) ఉన్నారు. మరి వీరిలో హౌస్ లోకి నిజంగా వెళ్ళబోయేది ఎంత మంది అనేది తెలియాలంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూస్తే సరిపోతుంది.