ఈ బ్యూటీకి అందాలు ఆరబోస్తున్న అవకాశాలు మాత్రం రావటం లేదట...

ఒక్కోసారి కొంత మంది నటీనటులకు అందం, అభినయం, నటనా ప్రతిభ వంటివి మెండుగా ఉన్నప్పటికీ తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం రాక గుర్తింపు తెచ్చుకోలేకపోయిన నటీనటులు సినిమా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.అయితే 2018వ సంవత్సరంలో తెలుగు ప్రముఖ రియాల్టీ గేమ్ షో అయిన బిగ్ బాస్ రెండో సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ప్రేక్షకులని బాగానే అలరించిన తెలుగు బ్యూటీ “నందిని రాయ్” కూడా ఈ కోవకే చెందుతుంది.

 Big Boss Beauty Nandini Rai Waiting For Movie Offers Telugu-TeluguStop.com

అయితే ఈ అమ్మడు మొదటగా 2011వ సంవత్సరంలో “ఫ్యామిలీ ప్యాక్” అనే హిందీ చిత్రం ద్వారా నటిగా తన సినీ కెరీర్ ని ఆరంభించింది.అయితే ఈ అమ్మడు స్వతహాగా తెలుగు రాష్ట్రానికి చెందిన నటి అయినప్పటికీ హిందీ లో మొదటిగా కెరియర్ మొదలుపెట్టడంతో హీరోయిన్ గా సెటిల్ అవుతుందని అనుకున్నారు.

కానీ దురదృష్టవశాత్తు ఈ అమ్మడికి పెద్దగా అవకాశాలు వరించడం లేదు.

 Big Boss Beauty Nandini Rai Waiting For Movie Offers Telugu-ఈ బ్యూటీకి అందాలు ఆరబోస్తున్న అవకాశాలు మాత్రం రావటం లేదట…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ మధ్య కాలంలో నటి నందిని రాయ్ సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థలు నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఘాటుగానే అందాలు ఆరబోస్తుంది.దీంతో ఈ అమ్మడు అందాల ఆరబోతకు నెటిజన్లు ఫిదా అయ్యారు.

దీంతో సోషల్ మీడియా మాధ్యమాలలో ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెరుగుతున్నప్పటికీ సినిమా అవకాశాలు మాత్రం పెద్దగా తలుపు తట్టడం లేదు.దీంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు నటనా ప్రతిభ, అందం, అభినయం, వంటివి మెండుగా ఉన్నప్పటికీ నందిని రాయ్ కి అవకాశాలు మాత్రం ధరించకపోవడంతో ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

మరికొందరైతే మాత్రం తన ప్రతిభను నిరూపించుకునేందుకు సరైన అవకాశం వస్తే “నందిని రాయ్” హీరోయిన్ గా మళ్లీ బాగానే నిలదొక్కు కుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో నందిని రాయ్ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సీరిస్ లలో కూడా నటించేందుకు ఆసక్తి చూపుతోంది.కాగా ఇటీవలే “ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్” అనే వెబ్ సిరీస్ లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించింది.ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ తెలుగులో ప్రముఖ ఓటిటి అయిన ఆహా లో ప్రసారం అవుతోంది.

అలాగే మరి బాలీవుడ్ చిత్రంలో ప్రధాన్యత ఉన్న పాత్రలో నటిస్థించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

#Web #Offers #Big Boss #Nandini Rai #BigBoss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు