మళ్లీ కొత్త కారు కొన్న బిగ్ బాస్ బ్యూటీ...

తెలుగులో అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన జీ తెలుగులో ప్రసారమయ్యే “కొంచెం ఇష్టం కొంచెం కష్టం” ధారావాహిక ద్వారా ప్రేక్షకులను బాగానే అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ “హిమజ” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే పర్వాలేదనిపించడంతో ప్రముఖ రియాల్టీ గేమ్ షో “బిగ్ బాస్ షో” లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కించుకుంది.

 Big Boss Beauty Himaja Purchased Mahindra Thar Vehicle, Big Boss Beauty, Himaja,-TeluguStop.com

దీంతో ఈ అమ్మడు సినీ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.ఇక అప్పటి నుంచి సీరియళ్లలో నటించడం మానేసిన హిమజ పలు తెలుగు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించడం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో హిమజ హీరోయిన్ గా నటించే అవకాశాలు కూడా దక్కించుకున్నట్లు సమాచారం.

అయితే నటి హిమజ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.

దీంతో అప్పుడప్పుడు తనకు సంబంధించిన సమాచారం మరియు పలు అందమైన ఫోటోలను షేర్ చేస్తూ తన అభిమానులను బాగానే అలరిస్తోంది.కాగా తాజాగా హిమజ మహీంద్రా థార్ వాహనాన్ని కొనుగోలు చేసింది.

అంతే కాకుండా తన కారుతో దిగినటువంటి వీడియోని కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.దీంతో హిమజా అభిమానులు మరియు సన్నిహితులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే హిమజా కొన్న మహేంద్ర థార్ వాహనం దాదాపుగా 13 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయలు ఖరీదు ఉంటుంది.అలాగే ఇప్పటికే హిమజ దగ్గర ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హిమజ తెలుగులో “జ” అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది.ఈ చిత్రానికి నూతన దర్శకుడు “సైది రెడ్డి చిట్టేపు” దర్శకత్వం వహిస్తున్నాడు.కాగా ఈ చిత్రం హార్రర్ థ్రిల్లర్ తరహాలో ఉండబోతున్నట్లు సమాచారం.అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయినప్పటికీ సినిమా థియేటర్లు తాత్కాలికంగా మూత పడటంతో ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube