స్క్రీన్ స్పేస్ కోసం హౌస్‌లో ఓవర్ యాక్షన్ చేస్తున్న కంటెస్టెంట్లు వీళ్లే?

ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్.ఇప్పటికే నాలుగు సీజన్ లు పూర్తవగా ప్రస్తుతం సీజన్ 5 ఓ రేంజ్ లో సాగుతుంది.

 Bigg Boss 5 Netizens Feel That These Contestants Are Over Acting, Big Boss 5, B-TeluguStop.com

ఈ షో ప్రారంభమై వారం రోజులు కూడా కాలేదు అప్పుడే ఇందులో కాంట్రవర్సీలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి.పరిచయాలు కూడా పూర్తిగా పెంచుకున్నారో లేదో కానీ మొత్తానికి గొడవలు చేసుకుంటూ శత్రువులుగా మారుతున్నారు.

ఇక మరికొందరు కాస్త ఓవరాక్షన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇంతకీ ఓవరాక్షన్ చేస్తున్న కంటెస్టెంట్ లు ఎవరో తెలుసుకుందాం.

నిజానికి బిగ్ బాస్ అంటే తాము రియల్ లైఫ్ లో ఎలా ఉంటున్నారో బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే ఉండటమే ఈ రియాలిటీ షో అర్థం.కానీ కొందరు కంటెస్టెంట్ లు మాత్రం అలా ఉండకుండా కేవలం స్క్రీన్ స్పేస్ కోసం నటిస్తున్నట్లు, ఓవరాక్షన్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.

అందులో కొందరి పేర్లు బాగా వినిపిస్తున్నాయి.ఇంతకీ వాళ్ళు ఎవరంటే వీజె సన్నీ, సిరి హనుమంత్, లహరి, కాజల్ పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

సన్నీ షో ప్రారంభం నుండి ఓవర్ గా కనిపించాడని.పైగా హౌస్ లోకి అడుగుపెట్టిన కొందరి అమ్మాయిలతో కాస్త అతి చేశాడని నెటిజన్లు అంటున్నారు.

Telugu Big Boss, Big Boss Ups, Lahari Shyri, Rj Kaajal, Screen Space, Siri Hanum

ఇక సిరి కూడా సొంత లాజిక్కులు వాడుతున్నట్లు.ప్రతిదానికి తనకే హక్కు ఉన్నట్లు చేస్తుందని టాక్ వినిపించింది.ఇక లహరి అందరితో సీరియస్ గా ఉంటుందని.అందరి దగ్గరికి వెళ్లి కావాలని గొడవ చేస్తుంది అని మళ్లీ వారి దగ్గరికి వెళ్లి కాంప్రమైజ్ చేయడంతో ఈమె స్క్రీన్ స్పేస్ కోసం చేస్తుందని నెటిజన్లు అంటున్నారు.

ఇక కాజల్ మాత్రం ప్రతిదానికి బాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుందని అందరి దగ్గరికి వెళ్లి తమ వ్యక్తిగత విషయాలను గుచ్చిగుచ్చి అడుగుతుందని అంటున్నారు.దీంతో వీళ్లు మాత్రమే బాగా అతి చేస్తున్నారు అని ఇలా చేసి త్వరగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లేలా చేసుకుంటున్నారని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube