బిగ్‌బాస్‌ గురించి ఈ వార్త నిజం అయితే సీజన్‌ 4 ఫ్లాప్‌ ఖాయం

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 మరో వారం పది రోజుల్లో ప్రారంభం కాబోతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

 Big Boss 4 Latest Update, Big Boss, 4, Telugu,nagarjuna, Contestents, Star Maa,-TeluguStop.com

ప్రస్తుతం కంటెస్టెంట్స్‌కు క్వారెంటైన్‌ నడుస్తుందని మరికొందరు పరీక్షలు చేయించుకుని క్వారెంటైన్‌ కేంద్రంలో జాయిన్‌ అవ్వబోతున్నారు.ఎప్పటిలా కాకుండా ఈ సారి షో ఫార్మెట్‌లో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

అందుకు సంబంధించిన పుకార్లు మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

ముఖ్యంగా ఒక వార్త మాత్రం ప్రేక్షకులకు చాలా ఆందోళన కలిగిస్తుంది.

అదేంటి అంటే సాదారణంగా బిగ్‌బాస్‌ కు సంబంధించి నేడు మనం చూస్తున్న ఎపిసోడ్స్‌ నిన్న హౌస్‌లో జరిగిన పరిణామాలు.అంటే నేడు ఉదయం నుండి రాత్రి వరకు జరిగిన సన్నివేశాలు సంఘటను తర్వాత రోజు ఎడిట్‌ చేసి రాత్రికి ప్రసారం చేస్తారు.

అంటే షోకు మరియు హౌస్‌లో టైమ్‌ కు 24 గంటలు తేడా ఉంటుంది.కాని ఈసారి మాత్రం వారం తేడా ఉంటుందని అంటున్నారు.

కరోనా పరిస్థితుల నేపథ్యంలో నేటి ఫుటేజ్‌ను తర్వాత రోజు ప్రసారం చేయడం సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు.అందుకే ఖచ్చితంగా టైం తీసుకోవాలని భావిస్తున్నారు.

కంటెస్టెంట్స్‌ భద్రత విషయంలో కూడా ఇదే మంచిదని షో రెప్యుటేషన్‌ దెబ్బ తినకుండా ఎవరికి అయినా కరోనా అంటూ నిర్థారణ అయినా వారిని ఎలిమినేట్‌ చేస్తున్నట్లుగా చెప్పడం కూడా బాగుంటుందనే ఉద్దేశ్యంతో వారం గ్యాప్‌ను తీసుకుంటున్నట్లుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రచారం చేస్తున్నారు.

అయితే నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.కనుక ఇది నిజం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

ఒక వేళ ఇదే కనుక నిజం అయితే షో పై గతంలో మాదిరిగా ప్రేక్షకులు ఆసక్తి చూపించే అవకాశం లేదంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube