బిబి4 : ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ  

Big Boss 4 Monal Gajjar Playing Triangle love Story, Monal Gajjar, Big Boss, Abhijith, Akhil, Rahul, Punarnavi - Telugu Abhijith, Akhil, Big Boss, Monal Gajjar, Punarnavi, Rahul

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 3 లో రాహుల్‌, పునర్నవిల మద్య లవ్‌ ట్రాక్‌ నడవడంతో ఆ సీజన్‌ మంచి సక్సెస్‌ అయ్యింది.వారిద్దరి మద్య ఏం లేకున్నా కూడా బిగ్‌బాస్‌ ఆడిన నాటకం బాగా రక్తి కట్టింది.

 Big Boss 4 Monal Gajjar Playing Triangle Love Story

ప్రేక్షకులు వారిద్దరిని ఇంకా కూడా ప్రేమలో ఉన్నారా అన్నంతగా కనెక్ట్‌ అయ్యారు.అందుకే ఈసీజన్‌లో కూడా ఒక లవ్‌ స్టోరీ నడిపించాలని ముందు నుండే బిగ్‌బాస్‌ నిర్వాహకులు అనుకున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే అమ్మాయిలను కాస్త ఎక్కువ మందిని మరియు అబ్బాయిలను కూడా రంగంలోకి దించారు.షో మొత్తం కూడా వారి లవ్‌ స్టోరీతో రన్‌ చేయాలని షో నిర్వాహకులు భావించారు.

బిబి4 : ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అనుకున్నట్లుగానే మోనాల్‌ గజ్జర్‌తో అభిజిత్‌ మరియు అఖిల్‌ లు కనెక్ట్‌ అవుతున్నారు.వారిపై కెమెరాలు ఫోకస్‌ పెట్టి మరీ చూపిస్తున్నారు.

నిన్నటి ఎపిసోడ్‌ లో సగం వరకు మోనాల్‌, అభిజిత్‌, అఖిల్‌ ల మాటల గురించి చూపించారు.మోనాల్‌ తో అభిజిత్‌ మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆమె అక్కడ నుండి వెళ్లి పోవడం ఆ తర్వాత మళ్లీ మాట్లాడటం జరిగింది.

ఇద్దరి మద్య కాస్త డెప్త్‌ గానే చర్చ జరిగింది.ఇక అఖిల్‌ కు మోనాల్‌ కు మద్య కాస్త డీప్‌ గానే ముచ్చట వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది.మోనాల్‌ ను ఇంప్రెస్‌ చేసేందుకు ఆమెతో మాట్లాడేందుకు అఖిల్‌ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నాడు.ఆమెను తిట్టినట్లే తిట్టి ప్రేమను ప్రదర్శిస్తూ ఆమె చుట్టు తిరుగుతున్నాడు.

ఆమె వేరే వాళ్లతో మాట్లాడితే అఖిల్‌ గుండె మండి పోతుంది.ఇద్దరు కలిసి కిచెన్‌ లో వంట చేసే సమయంలో సరదాగా ఆడుతూ పాడుతూ ఉన్నారు.

మొత్తానికి బిగ్‌బాస్‌ సీజన్‌ 4 లో ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీని మొదలు పెట్టి షో పై ఔత్సాహిక ప్రేక్షకులకు ఆసక్తి కల్పిస్తున్నారు.ఈ ప్రేమ ఎక్కడకు దారి తీస్తుంది అనేది చూడాలి. రెండవ మరియు మూడవ సీజన్‌లలో షో నిర్వాహకులు చూపించింది కేవలం డ్రామానే అంటూ ఇప్పటికే తేలిపోయింది.ఈ సీజన్‌ లో కూడా కావాలని వారితో ముందుగా చెప్పి మరీ ఇలా డ్రామా ఆడిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

#Punarnavi #Big Boss #Rahul #Monal Gajjar #Abhijith

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Big Boss 4 Monal Gajjar Playing Triangle Love Story Related Telugu News,Photos/Pics,Images..