ఊరించి ఉసూరుమనిపించిన బిగ్‌బాస్‌  

Big Boss 3 Telugu This Week Latest Update-rahul And Ravi War,varun And Vithika Argument,varun And Vithika Love Pillow

తెలుగు బిగ్‌బాస్‌ మొదటి వారం చాలా ఆసక్తిగా సాగింది.కాని ఆ తర్వాత నుండి రేటింగ్‌ దారుణంగా పడిపోతూ వచ్చింది.బిగ్‌బాస్‌ రేటింగ్‌తో టెన్షన్‌ పడుతున్న షో నిర్వాహకులు రేటింగ్‌ పెంచేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు...

Big Boss 3 Telugu This Week Latest Update-rahul And Ravi War,varun And Vithika Argument,varun And Vithika Love Pillow-Big Boss 3 Telugu This Week Latest Update-Rahul And Ravi War Varun Vithika Argument Varun Love Pillow

అందుకోసం ఇంటి సభ్యుల మద్య గొడవలు పెట్టడం.కొంత మంది మద్య స్నేహం బ్రేక్‌ అయ్యేలా చేయడం వంటివి చేస్తున్నారు.

ఇక నిన్న ఉదయం నుండి షోకు సంబంధించిన ఒక ప్రోమో తెగ హల్‌చల్‌ చేసింది.

Big Boss 3 Telugu This Week Latest Update-rahul And Ravi War,varun And Vithika Argument,varun And Vithika Love Pillow-Big Boss 3 Telugu This Week Latest Update-Rahul And Ravi War Varun Vithika Argument Varun Love Pillow

అదేంటి అంటే వరుణ్‌ మరియు వితికలు సీరియస్‌గా గొడవ పడటం, ఆగొడవలో భాగంగా వరుణ్‌ కాఫీని ఆమె మొహాన కొట్టడం.ఈ రెండు సంఘటనలతో బిగ్‌బాస్‌ గురించి సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది.పచ్చని సంసారంలో బిగ్‌బాస్‌ నిప్పులు పోశాడంటూ మీమ్స్‌ వచ్చాయి.

ఇక రాహుల్‌ అలీల మద్య గొడవ కూడా చాలా సీరియస్‌గా మారిందని, రాహుల్‌ను హిమజ కొట్టే వరకు పరిస్థితి వెళ్లిందని అంతా అనుకున్నారు.కాని అంతా సీక్రెట్‌ టాస్క్‌ అని ముందే రివీల్‌ అయ్యింది.

సోమవారం ఎపిసోడ్‌లో ఆరుగురు ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయితే ముగ్గురికి బిగ్‌బాస్‌ ఛాన్స్‌ ఇచ్చాడు.ఆ ముగ్గురు బిగ్‌బాస్‌ ఇచ్చిన టాస్క్‌లు చేయాల్సి ఉంది.

ఆ ముగ్గురులో మొదట రవి ఒక ఇంటి సభ్యుడిపై షేవింగ్‌ క్రీమ్‌ అంతా పోయాల్సి ఉంటుంది.అలాగే ఒక ఇంటి సభ్యుడి బెడ్‌ను పూర్తిగా తడపాల్సి ఉంది.ఇక రాహుల్‌ విషయానికి వస్తే వరుణ్‌, వితికల లవ్‌ పిల్లో చించేయాలి.

ఎవరితో అయినా గొడవ పడాలి.ఇక వరుణ్‌ విషయానికి వస్తే ఒకరిపై కాఫీ కొట్టాలి, ఒకరికి ఇష్టమైన డ్రస్‌ను చించేయాలి.ఈ ముగ్గురు వారికి ఇచ్చినవి చేశారు.

దాంతో ముగ్గురు కూడా ఎలిమినేషన్‌ నుండి సేవ్‌ అవ్వడంతో పాటు, వచ్చే వారానికి కూడా ఇమ్యూనిటి దక్కించుకున్నారు.అలా నిన్నటి ఎపిసోడ్‌ పూర్తి అయ్యింది.ఏదో ఉందనుకుంటే ఏమీ లేదని అంతా సరదా అని తేలిపోయి ప్రేక్షకులు ఉసూరుమన్నారు.