“బిగ్ బాస్ – 2” హోస్ట్ చేసేది “నాని”.? 12 మంది కంటెస్టెంట్స్ వీరేనా.? లిస్ట్ చూడండి!  

ఒకవైపు విమర్శలు,మరోవైపు పొగడ్తలతో బిగ్ బాస్ స్టార్ట్ అయింది.విజయవంతంగా కంప్లీట్ అయింది కూడా.మొదట్లో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నా ఫైనల్ కి వచ్చేసరికి మాత్రం మంచి రెస్పాన్సే వచ్చింది.బిగ్ బాస్ సీజన్ టూ కోసం ప్రేక్షకులను ఎదురు చూసేలా చేసింది.

తమిళ బిగ్ బాస్ వివాదాలతో కొనసాగితే తెలుగు బిగ్ బాస్ మాత్రం మంచి హెల్తీ వాతావరణంలో ముగిసింది.ప్రోగ్రాం విజయం సాధించడంలో ఎన్టీఆర్ హోస్టింగ్ పెద్ద పీట వేసింది.

-

మరి సెకండ్ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడం అనుమానమే…హోస్ట్ ఎవరూ.కంటెస్టంట్స్ ఎవరూ అనుకుంటున్నారా.

ఎన్టీఆర్ ప్లేస్ లో నాని హోస్ట్.కానీ ఎన్టీఆర్ ని తప్ప వేరొకరిని యాంకర్ గా ఊహించుకోలేం అని ఇప్పటికే చెప్పేస్తున్నారు అభిమానులు.

ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ,బిగ్ బాస్ సీజన్ వన్ హిట్ తో మేం అంటే మేం పార్టిసిపేట్ చేస్తాం అని పొటీపడుతున్నారట.మరీ ఆ పోటీలో నుండి ప్రోగ్రాం నిర్వాహకులు కొంతమందిని సెలక్ట్ చేసినట్టు సమాచారం .

వారిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఛార్మీ,తరుణ్ లు వస్తున్నారట.ఇంతకుముందు కూడా డ్రగ్స్ నిందింతులు ముమైత్ ,నవదీప్ బిగ్ బాస్ వన్ లో పార్టిసిపేట్ చేసారు.

ఇప్పుడు ఛార్మీ,తరుణ్ లు.ఇక మరికొంతమంది కంటెస్టంట్స్ గా పార్టిసిపేట్ చేయబోతున్నది.గజాలా,ఆర్యన్ రాజేశ్,ధన్యా ,చాందిని చౌదరి,హర్ష,కమెడియన్ వేణు,వరుణ్ సందేశ్,యాంకర్ లాస్య,గీతా మాధురి,తనీష్ ల పేర్లు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ వన్ లో పాల్గొన్న వారిని స్టార్స్ ని చేసింది ప్రోగ్రాం.

బిగ్ బాస్ ఫేం అంటే ఒక క్రేజ్ ఏర్పడింది.అటు డబ్బుకి డబ్బు,ఇటు అవకాశాలకు అవకాశాలను తెచ్చిపెట్టింది.మరి బిగ్ బాస్ 2 తో వీళ్లల్లో ఎవరి కెరీర్ ఊపందుకోబోతుంది.ఎవరు మరిన్ని ఛాన్స్ లు కొట్టేస్తారో చూద్దాం…

Host – Nani

Participants:

#1.Charmi

#2.Tarun

#3.Gajala

#4.Rajesh

#5.Dhanya Balakrishna

#6.Chandini Chowdary

#7.Comedian Venu

#8.Varun Sandesh/

#9.Anchor lasya

#10 Geetha madhuri

#11.Tanish

#12.Viva Harsha

.

తాజా వార్తలు