బిగ్ బాస్ హౌస్ లో గెలవడానికి ఆ ముగ్గురు అంత పెద్ద స్కెచ్ వేసారా.?       2018-06-30   00:12:31  IST  Raghu V

బిగ్ బాస్ హౌజ్ నుంచి నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యారు. ఎలిమినేషన్ రౌండ్‌కు ముగ్గురు సభ్యులు నామినేట్ అవ్వగా వారిలో గణేశ్ ప్రొటెక్ట్ అయ్యాడు. మిగిలిన ఇద్దరిలో కౌశల్, నూతన్ నాయుడుల మధ్య పోటీ ఏర్పడగా.. నూతన్ నాయుడు ఎలిమినేట్ అయ్యాడు. మొదటి వరం సంజన చేసిన ఓవర్ ఆక్షన్ కి సంజన ఎలిమినేట్ అయిపొయింది. బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మాన్ గా ఎంటర్ అయిన ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు.

బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే వ్యక్తి పేరు చెప్పింది భానుశ్రీ . గణేశ్‌లో ఎలాంటి మార్పు రాలేదని.. కాబట్టి ఈసారి తనే వెళ్లే అవకాశముందని తెలిపింది. ఇప్పటికే ఇద్దరు కామనర్లు ఇంటి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి గణేశ్‌పైనే పడింది. ఇదే సమయంలో భానుశ్రీ గణేశ్ పేరు చెప్పడంతో.. ప్రేక్షకుల్లో ఉన్న అనుమానాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందరు కలిసి గణేష్ ని నామినేట్ చేశారు.

అయితే చివరి వరకు షోలో ఉండే విధంగా కొందరు కంటెస్టెంట్స్ హౌస్ లోకి వెళ్ళకముందే జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఈ షోలో ఎలిమినేషన్ రౌండ్ ఓటింగ్ ద్వారా జరుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. అందుకే కొందరు కంటెస్టంట్లు హౌస్ లోకి రాకముందే తమ కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్ ను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు అని సమాచారం. ఇద్దరు, ముగ్గురు పోటీదారులు ఈవిధమైన టీమ్ లను ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. హౌస్ లో ఉన్న వారిని ఈ టీమ్ ఎలిమినేషన్ రౌండ్ నుండి కాపాడటమే వారి ఉద్దేశం.

దీనికోసం కొంత డబ్బు ఇచ్చి అకౌంట్లను మైంటైన్ చేస్తున్నారు అంట. ఈ లిస్టులో తేజస్వి, యాంకర్ దీప్తి, అలానే దీప్తి సునయన ఉన్నారని టాక్. టైటిల్ ను గెలవడానికి ముందే ప్లాన్ చేసుకొని మరి హౌస్ లోకి అడుగుపెట్టారు ఈ ముగ్గురు. టైటిల్ సంగతి తరువాత చివరి వరకు అయినా.. వీళ్లు హౌస్ లో కొనసాగుతారేమో చూడాలి!