టాలీవుడ్‌కు బిగ్‌బాస్‌ 2 ఫీవర్‌

హిందీలో సూపర్‌ సక్సెస్‌ అయిన బిగ్‌బాస్‌ను సౌత్‌లో కూడా గత సంవత్సరం ప్రారంభించిన విషయం తెల్సిందే.ఎన్టీఆర్‌ హోస్ట్‌గా తెలుగులో, కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా తమిళంలో ప్రసారం అయ్యింది.

 Big Boss 2 Fever In Tollywood-TeluguStop.com

రెండు భాషల్లో కూడా బిగ్‌బాస్‌ సూపర్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాడు.ఇప్పుడు తెలుగు మరియు తమిళనాట రెండవ సీజన్‌కు సిద్దం అవుతున్నారు.

తమిళంలో కమల్‌ హాసన్‌ హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు.అయితే తెలుగులో మాత్రం ఇప్పటి వరకు హోస్ట్‌ ఎవరు అనేది ఖరారు కాలేదు.

నానిని హోస్ట్‌గా ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.కాని ఆ వార్తల్లో క్లారిటీ రావాల్సి ఉంది.

ఇక రెండవ సీజన్‌లో స్థానం కోసం వేలాది మంది సెలబ్రెటీలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మొదటి సీజన్‌లో కేవలం సెలబ్రెటీలను మాత్రమే ఎంపిక చేశారు.కాని రెండవ సీజన్‌లో కొంత మంది సామాన్యులను కూడా ఎంపిక చేయబోతున్నట్లుగా మాటీవీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.ఈ నేపథ్యంలో సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు అంతా కూడా బిగ్‌బాస్‌లో కనిపించాని ముచ్చట పడుతున్నారు.

సినిమాల్లో వరుసగా ఆఫర్లు దక్కించుకుంటున్న వారు మరియు సినిమాల్లో ఛాన్‌ు లేని వారు బిగ్‌బాస్‌లో పాల్గొనాని ఆశ పడుతున్నారు.అందుకోసం తమకు తెలిసిన వారితో పెద్ద ఎత్తున పైరవీలు చేయిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మా ఛానెల్‌లో నాగార్జునతో పాటు చిరంజీవికి గతంలో కీలక షేర్‌ ఉన్న విషయం తెల్సిందే.ఇప్పటికి కూడా వారు కొంత భాగంను కలిగి ఉండటంతో వారి వద్దకు ఎంతో మంది రికమండేషన్‌ కోసం వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి, నాగార్జునతో చిన్న పరిచయం ఉన్న వారు కూడా బిగ్‌బాస్‌ నిర్వాహకులకు తమ పేర్లను రిఫర్‌ చేయమంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.దాంతో వారికి ప్రస్తుతం పెద్ద తలనొప్పిగా తయారైంది.

నాగార్జున వద్దకు వందలాది మంది విజ్ఞప్తులతో వస్తున్నారట.అయితే స్టార్‌ మా వారు మాత్రం రికమండేషన్స్‌తో వచ్చే వారిని పరిశీలించమని, తాము ఆడిషన్స్‌ చేసి, ఆ తర్వాత మాత్రమే వారిని తీసుకుంటామని చెప్పుకొస్తున్నారు.

ఈసారి గతంతో పోల్చితే ఎక్కువ రోజులు షో నిర్వహించనున్నారు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను జూన్‌ చివర్లో లేదా జులైలో ప్రారంభించే అవకాశం ఉంది.

సినిమా ఇండస్ట్రీలోని పువురు బిగ్‌బాస్‌ ఇంట్లో అడుగు పెట్టేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే నిర్వాహకులు మాత్రం అన్ని విషయాలను బేరీజు వేసుకుని, అన్ని లెక్కలు చూసుకుని, హౌజ్‌ను బ్యాలన్స్‌ చేసేలా పార్టిసిపెంట్లను ఎంపిక చేయబోతున్నారు.

మరి కొన్ని రోజుల్లో ఫైనల్‌ లిస్ట్‌ తయారు అవుతుందని చెబుతున్నారు.బిగ్‌బాస్‌లో ఫైనల్‌ విన్నర్‌గా నిలువకున్నా కూడా అందులో పాల్గొంటే భారీ పబ్లిసిటీ దక్కుతుంది.అందుకే షోలో కనిపించాలని అంతా భావిస్తుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube