2020ని రీ ఇన్ స్టాల్ చేద్దామా అంటున్న బిగ్ బి  

Big B Interesting Post On Corona Virus Version 2020 - Telugu, Bollywood, Corona Effect, Lock Down, Tollywood

కరోనా వైరస్

భయంతో ప్రపంచం మొత్తం మెజారిటీ

లాక్ డౌన్

లో ఉంది.ఆర్ధిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్ళిపోతుందని తెలిసిన కూడా తప్పని సరి పరిస్థితిలో మనల్ని మనం కాపాడుకోవడం కోసం అన్ని దేశాలు యుద్ధమే చేస్తున్నాయి.

 Big B Interesting Post On Corona Virus Version 2020

ఓ విధంగా ఇది మూడో ప్రపంచం యుద్ధం లాంటిది.అయితే ఇది దేశాల మధ్య కాకుండా వైరస్ తో మనిషి అనే రాక్షసితో తన మనుగడ నిలుపుకోవడం కోసం మనిషి చేస్తున్న యుద్ధం.

ఈ యుద్ధంలో అంతిమ విజయం ఎవరిని వరిస్తుందో అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్న.ఇక ఈ పరిస్థితిలో ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంది.ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

సెలబ్రిటీలు

కూడా ఇప్పుడు ఇంటిపట్టునే ఉండి కుటుంబంతో కాలక్షేపం చేస్తున్నారు.

2020ని రీ ఇన్ స్టాల్ చేద్దామా అంటున్న బిగ్ బి-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే ఈ ఖాళీ సమయంలో సెలబ్రిటీలు

సోషల్ మీడియా

లో ఆసక్తికరమైన పోస్టులు పెడుతూ ఫ్యాన్స్ కి కాలక్షేపం అందించడం, వారితో తన అనుభవాలు షేర్ చేసుకోవడం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో బిగ్ బి అమితాబచ్చన్ పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

అమితాబ్

ఒక ఫోటోని పెట్టి 2020 సంవత్సారాన్ని మనం డిలేట్ చేద్దామా? ఈ సంవత్సరాన్ని మళ్ళీ రీ ఇన్ స్టాల్ చేద్దామా… ఇందులో వైరస్ ఉంది అని ఆసక్తికరమైన మెసేజ్ పెట్టారు.ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దీనిపై నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

కచ్చితంగా ఈ 2020 వైరస్ వెర్షన్ ని డిలేట్ చేయాల్సిన అవసరం ఉందని కామెంట్లు పెడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు