అల్లు అర్జున్ డాన్స్ పై స్పందించిన బిగ్ బీ... గుట్టు రట్టు చేశారుగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకొని దూసుకుపోతున్న నటుడు అల్లు అర్జున్ గురించి చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న ఈయన పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందారు.

 Big B Amitab Bachchan Comments On Allu Arjun Dance Pushpa Srivalli Song Details,-TeluguStop.com

ఇలా ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇందులో ఆయన తన స్టైల్ ద్వారా అందరిని ఆకట్టుకున్నారు.ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీవల్లి పాటకు అల్లు అర్జున్ చేసిన డాన్స్ కు అందరూ ఫిదా అయ్యారు.

ఇలా అల్లు అర్జున్ చేసిన ఈ డాన్స్ వీడియో పై చాలా మంది వీడియోలు చేస్తూ పోస్టులు చేశారు.ఇందులో అల్లు అర్జున్ గాగుల్స్ పెట్టుకొని.డాన్స్ చేయడం మధ్యలో చెప్పు జారిపోతే తిరిగి వేసుకోవడం అందరిని ఎంతగానో ఆకట్టుకుంది.ఇకపోతే ఈ డాన్స్ గురించి తాజాగా బిగ్ బీ అమితాబచ్చన్ స్పందించారు.

ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్ పతి 14వ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ డాన్స్ గురించి ప్రస్తావన వచ్చింది.ఈ క్రమంలోని ఈ డాన్స్ వెనుక దాగి ఉన్న అసలు సీక్రెట్ ఏంటో అమితాబచ్చన్ బయటపెట్టారు.

Telugu Allu Arjun, Bigamitab, Bigamitabh, Kbc Season, Pushpa Srivalli, Sri Valli

నిజానికి ఈ పాటలో ఆయన చెప్పు జారిపోతే తిరిగి వేసుకోవడం కొరియోగ్రఫీలో భాగంగా చేయలేదని పొరపాటున చెప్పు జారిపోతే అల్లు అర్జున్ చెప్పు వేసుకోవడానికి వెళ్లారట.అయితే ఈ సన్నివేశం బాగుందని సుకుమార్ ఈ సన్నివేశాన్ని అలాగే పెట్టారని ఈ సన్నివేశమే అద్భుతమైన స్టెప్ గా మారిపోయిందనే అసలు విషయాన్ని ఈ సందర్భంగా అమితాబచ్చన్ వెల్లడించారు.ప్రస్తుతం అమితాబచ్చన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube