అనుష్క వల్ల గోపీచంద్ ఇంట్లో పెద్ద గొడవలు.. ఆ తర్వాత ఏ హీరోయిన్ అతని ఇంటికి వెళ్లకుండా?

Big Argument In Gopichands House Due To Anushka Next Which Heroine Did Not Go To His House After That

ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీల మద్య గాసిప్స్ పుట్టడం కొత్తేమి కాదు.ఇవన్నీ ఇండస్ట్రీలో మామూలే అని చెప్పవచ్చు.

 Big Argument In Gopichands House Due To Anushka Next Which Heroine Did Not Go To His House After That-TeluguStop.com

ఒక హీరో హీరోయిన్ మధ్య లవ్ నడుస్తుందని త్వరలో పెళ్లి చేసుకుంటారని ఇప్పటివరకు ఎన్నో వార్తలు విన్నాం.కానీ అవన్నీ బయట జనాలు పుట్టించే ఒట్టి మాటలన్ని బయటపడ్డాయి.

ఇదిలా ఉంటే గతంలో అనుష్క, గోపీచంద్ మధ్య కూడా ఇటువంటి పుకారే బయట పడింది.

 Big Argument In Gopichands House Due To Anushka Next Which Heroine Did Not Go To His House After That-అనుష్క వల్ల గోపీచంద్ ఇంట్లో పెద్ద గొడవలు.. ఆ తర్వాత ఏ హీరోయిన్ అతని ఇంటికి వెళ్లకుండా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో గోపీచంద్, అనుష్క మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

వీరిద్దరూ కలిసి లక్ష్యం, శౌర్యం సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలు తమకు మంచి సక్సెస్ కూడా ఇచ్చాయి.

అయితే గతంలో వీరి మధ్య లవ్ నడిచిందని టాక్ వినిపించింది.అంతేకాకుండా అనుష్క ఓ సినిమాలో ఎక్స్ పోజింగ్ చేస్తుందని తెలియడంతో వెంటనే తనకు ఫోన్ చేసి వార్నింగ్ కూడా ఇచ్చాడని తెలిసింది.

Telugu Anushka, Argument, Film Industry, Gopichand, Heroine, House, Tollywood-Movie

అయినా కూడా అనుష్క వినకుండా ఆ సినిమాలో నటించిందట.అలా అనుష్కకు గోపిచంద్ వార్నింగ్ ఇవ్వడంతో వీరి మధ్య నిజంగానే లవ్ నడుస్తుందని అందరికీ అనుమానాలు రావడం తో ఇండస్ట్రీలో ఈ వార్త బాగా చక్కర్లు కొట్టింది.దీంతో ఈ విషయం ఏకంగా గోపీచంద్ ఇంట్లో కూడా బయట పడటంతో ఇంట్లో పెద్ద గొడవలు కూడా జరిగాయట.

ఇక ఈ విషయం గురించి గోపీచంద్, అనుష్కలు కూడా తమ మధ్య ఏం లేదని స్పందించారు.

అయినా కూడా వీరి మధ్య రిలేషన్ గురించి ఫుల్ స్టాప్ మాత్రం పడలేదు.అలా వీరి మధ్య గాసిప్స్ నడుస్తున్న కూడా మళ్ళీ వీరి కాంబినేషన్ లో ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సంస్థ ఓ సినిమాను ప్లాన్ చేశారు.ఇక ఈ సినిమా చేయడానికి గోపీచంద్ ఒప్పుకున్నాడట.

ఇక వీరి కాంబినేషన్ లో మళ్లీ సినిమా ఉందని తెలియడంతో అందరూ వీరి మధ్య రిలేషన్ గట్టిదే అని ఫిక్స్ అయ్యారు.

దీంతో గోపీచంద్ కుటుంబ సభ్యులు ఈ సినిమా చేయొద్దని గొడవకు దిగారట.అనుష్క తో పాటు ఏ హీరోయిన్ కూడా తమ ఇంటికి రావద్దని గోపీచంద్ ఇంటి పెద్దలు గట్టిగా చెప్పారట.

ఇక ఈ విషయంలో గోపీచంద్ బాగా ఇబ్బందిగా ఫీల్ అయ్యాడట.

Telugu Anushka, Argument, Film Industry, Gopichand, Heroine, House, Tollywood-Movie

సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి పుకార్లు సహజమే అని చెప్పినా కూడా తన ఇంట్లో వాళ్ళు అసలు ఒప్పుకోలేదట.దీంతో గోపీచంద్ కు విసుగొచ్చి తాను ఎవరితో నటించాలో తనకు తెలుసని ఇంట్లో వారిపై అరిచాడట.కానీ మళ్ళీ ఆలోచించి ఇంట్లో పెద్దవాళ్ళను బాధ పెట్టకూడదు అనుకొని ఇంట్లో వాళ్ళ కండిషన్స్ కు ఒప్పుకున్నాడట.

ఇక చివరికి ఆ సంస్థ వారికి ఫోన్ చేసి సినిమా డేట్స్ కుదరడం లేదని చెప్పి తప్పించుకున్నాడని తెలిసింది.అదే సినిమాను రవితేజ తో చేయగా ఆ సినిమా డాన్ శీను గా తెరకెక్కింది.

ఇక ఈ సినిమా రవితేజకు మంచి సక్సెస్ ను అందించింది.ఇక గోపీచంద్ ఇటీవలే సిటీమార్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

#Anushka #Gopichand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube