బిడెన్ సంచలన నిర్ణయం...వారికి నో ఎంట్రీ..!!

అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ తనదైన పాలనతో అమెరికా అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు.అమెరికాను మళ్ళీ మామూలు స్థితికి తీసుకురావాలంటే అలుపెరుగకుండా అందరూ కష్టపడి పనిచేయాలని సూచిస్తున్నారు.

 Biden Sensational Decision No Entry For Them , Biden, Americans, Non Americans,-TeluguStop.com

కరోన మహమ్మారి వలన కుదేలైన అమెరికా ఆర్ధిక వ్యవస్థ, అమెరికన్స్ ఉద్యోగాలు, వారి ఆర్ధిక అవసరాలు, ఇలాంటి ప్రధానమైన సమస్యలపై దృష్టిపెట్టిన బిడెన్ వాటి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలోనే 100 రోజుల కరోనా కట్టడిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు.

అమెరికాలోని ప్రతీ ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలని, వ్యాక్సినేషన్ వేయించుకోవాలని 100 రోజుల ప్రణాళిక సిద్దం చేశారు.

ఇప్పటికే బిడెన్ ఆదేశాల ప్రకారం అన్ని చోట్ల ఈ నిభందనలు అమలు అవుతున్నాయి.

అయితే కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు పెరగడం కారణంగా రోజుకు సుమారు ౩ నుంచి 4 వేల మంది మృతి చెందుతున్నారు.అంతేకాదు రోజు రోజుకు కొత్త వైరస్ ల కేసులు కూడా పెరిగిపోతున్నాయి.ఇప్పటి వరకూ కరోనా కారణంగా అమెరికాలో చనిపొయిన వారి సంఖ్య 4,30,000 లకు చేరుకోగా కరోనా బారిన పడిన వారి సంఖ్య దాదాపు 2.57 కోట్లుగా నమోదు అయ్యింది.ఈ పరిస్థితుల నుంచీ గట్టెక్కడానికి బిడెన్ ఓ ప్రణాళికను సిద్దం చేశారు.

Telugu Americans, Biden, Brezil, Corona, Irland, Kindom-Telugu NRI

యూరప్ లోని యునైటెడ్ కింగ్ డం , ఐర్లాండ్, బ్రెజిల్ వంటి దేశాలకు వెళ్ళిన నాన్ అమెరికన్స్ ఎవరైతే ఉన్నారు వారిని అమెరికా రావద్దని సూచించారు, వారిని అమెరికాలోకి ప్రవేశించనివ్వద్దని అధికారులకు సూచించారు.అమెరికన్స్ ఎవరూ కూడా ఆయా దేశాలకు వెళ్ళద్దని ఆదేశాలు జారీ చేశారు.అయితే ఈ దేశాలు వెళ్ళిన అమెరికన్ మళ్ళీ అమెరికాలోకి రావడానికి మాత్రం కొన్ని సడలింపులు ఇచ్చారు.

ఏఏ దేశాలకు అమెరికన్స్, నాన్ అమెరికన్స్ వెళ్ళ కూడదో, అమెరికన్స్ తిరిగి అమెరికాలోకి రావడానికి ఎలాంటి నిభందనలు ఉన్నాయో అనేవి త్వరలో మీడియా సమావేశంలో వెల్లడిస్తామని ఓ అధకారి పేర్కొన్నారు.అమెరిక అభ్యంతర చెప్పిన దేశాల జాబితాలోకి దక్షిణ ఆఫ్రికాను కూడా చేర్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube