బిడెన్ సంచలన నిర్ణయం...అమెరికాలో కొత్త చట్టం...!!

అమెరికా అధ్యక్షుడిగా బిడెన్ పదవీ భాద్యతలు చేపట్టిన నాటినుంచీ ఆయన తీసుకునే నిర్ణయాలు సంచలనాలకు కేంద్రం అవుతున్నాయి.ఇమ్మిగ్రేషన్ మొదలు వలస వాసుల విషయంలో ట్రంప్ విధించిన నిభంధనలు అన్నిటిపై ఉక్కుపాదం మోపిన ట్రంప్, అందరికి ఆమోదమోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 Biden's Sensational Decision  New Law In America , Biden, Trump, America, Altra-TeluguStop.com

నామినేటెడ్ పదవులు మొదలు అత్యంత కీలకమైన పదవులలో భారత సంతతి వ్యక్తులను నియమిస్తూ బిడెన్ తీసుకుంటున్న నిర్ణయాలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.ఇదిలాఉంటే బిడెన్ తాజాగా తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.

కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన అమెరికాను గాడిలో పెట్టేందుకు బిడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.సెనేట్ లో తనకు ఉన్న బలంతో ఆల్ట్రా మిలినియర్ ట్యాక్స్ యాక్ట్ పేరిట కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు.

ఈ చట్టం కారణంగా 50 మిలియన్ డాలర్ల కంటే పై మొత్తంలో ఆదాయం కలిగి ఉన్న వారికి ప్రతీ ఏడాది 3% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.అంటే 1 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ మొత్తంలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇదిలాఉంటే బిడెన్ తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం కారణంగా అమెరికాలో దాదాపు లక్ష మందికి పైగా ధనిక కుటుంభాలపై ప్రభావం పడనుందని అంటున్నారు నిపుణులు.ప్రపంచ కుబేరుల జాబితా తీస్తే అందులో సగానికి సగం మంది అమెరికాలోనే ఉండటం విశేషం.

ఇప్పుడు ఈ భారం మొత్తం వారిపై పడనుంది.ఈ చట్టం అమలులోకి రాగానే అమెరికాలో ప్రభావితం అయ్యే ధనికులు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ముందు వరసలో ఉన్నారు.జెఫ్ ఏడాదికి 5.7 బిలియన్ డాలర్ల పన్ను చెల్లించాల్సి ఉంటుందట.ఇక టెస్లా స్పేస్ సంస్థ మాస్క్ 4.6 బిలియన్ డాలర్లు పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.ఇలా ధనికుల వద్దనుంచి సేకరించే ఈ పన్ను అక్షరాలా ౩ ట్రిలియన్ డాలర్లు అవుతుందని, ఈ మొత్తాన్ని వివిధ రంగాలలో ఉపయోగిస్తామని అధికారులు చెప్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube