బిడెన్ సంచలన నిర్ణయం..భారత విద్యార్ధులకు భారీ ఊరట...!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎట్టకేలకు విదేశీ విద్యార్ధులకు తీపి కబురు చెప్పారు.ముఖ్యంగా భారతీయ విద్యార్ధులకు బిడెన్ ప్రకటన ఎంతో ఊరట ఇచ్చిందనే చెప్పాలి.

 Biden's Sensational Decision..a Huge Shock For Indian Students, Biden, Trump, Ob-TeluguStop.com

ఎంతో మంది వలస విద్యార్ధులను దృష్టిలో పెట్టుకుని, ప్రవాసి సంఘాల నుంచీ వచ్చే వినతులను పరిశీలించిన తరువాత ట్రంప్ సర్కార్ ప్రవేశ పెట్టిన విద్యార్ధి వీసా గడువు నిభంధనపై బిడెన్ తాజాగా స్పందించారు.విదేశీ విద్యార్ధులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమెరికాను నమ్మి వచ్చిన వారికి అన్యాయం జరగదని విద్యార్ధి వీసా నిభందనలు ఎత్తేస్తున్నట్టుగా ప్రకటించారు.

మాజీ అధ్యక్షుడు ట్రంప్ తన హాయంలో విద్యార్ధి వీసాలపై నిర్దిష్టమైన గడుపు విధించడంతో ఎంతో మంది విద్యార్ధులు ఆందోళన చెందారు.గడువు ముగిస్తే అమెరికాను విడిచి అర్ధంతరంగా చదువులు ఆపేసి వెళ్ళాల్సిన పరిస్థితులు రావడంతో పలు సంఘాల మద్దతుతో ఆందోళనలు కూడా చేపట్టారు.

అయితే ఈ విషయంపై నూతన అధ్యక్షుడు బిడెన్ ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడుగా ఉన్న సమయంలోనే సానుకూలంగా స్పందించారు.దాంతో ప్రస్తుతం అధ్యక్షుడుగా విద్యార్ధుల విన్నపాలపై పచ్చ జెండా ఊపారు.

విదేశీ విద్యార్ధులు అమెరికాలో ఎన్నో రోజులు చదువుకుంటానంటే అన్ని రోజులు ఉండండి వీసాల గడుపు విధానాన్ని ఎత్తేశామని ప్రకటించారు.

Telugu America, Biden, Indian, Obama, Visa, Trump-Telugu NRI

బిడెన్ నిర్ణయం వలన అమెరికా వ్యాప్తంగా చదువుకుంటున్న విదేశీ విద్యార్ధులు ఊపిరి పీల్చుకున్నారు.అమెరికాలోని సుమారు 2 లక్షల మంది భారత విద్యార్ధులకు బిడెన్ నిర్ణయం మేలు చేకూర్చనుందట.బిడెన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి సుమారు 30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారట.

ఈ సర్వేలో దాదాపు ట్రంప్ రూల్స్ కు వ్యతిరేకంగా 99 శాతం మంది ఓట్లు వేయగా, కేవలం 1 శాతం మంది మాత్రమే మద్దతు పలికారట.ఏది ఏమైనా బిడెన్ ప్రకటనతో విదేశాలు వెళ్లి చదువుకోవాలని భావించే విద్యార్ధులకు ధైర్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube