అమెరికా అధ్యక్షుడుగా జో బిడెన్ భాద్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయ్యింది.ఎంతో ఉత్ఖంటబరిత వాతావరణంలో అధ్యక్షుడిగా ఎన్నోకోబడిన బిడెన్ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీపై తనదైన రీతిలో స్పందిస్తానని, తక్షణ చర్యలు చేపడుతానని, ముఖ్యంగా కరోనా మహమ్మారిని అమెరికా నుంచీ తరిమి తరిమి కొడుతానని హామీ ఇచ్చారు.
అయితే బిడెన్ అన్న మాట మీద నిలబడ్డారా, ఏడాది పాటు సాగిన బిడెన్ పాలన జన రంజకంగా ఉందా…?? అసలు బిడెన్ అధ్యక్షుడిగా హిట్టా…ఫట్టా….??.
అధ్యక్షుడిగా బిడెన్ అధికారం చేపట్టిన తరువాత ట్రంప్ తీసుకున్న విమర్శనాత్మక నిర్ణయాలని నిలిపివేశారు.తనకంటూ ఓ ప్రత్యేకమైన టీమ్ ఏర్పాటు చేసుకున్న పాలనలో ఎక్కడా రాజీపడకుండా పగడ్బందీ ప్రణాళిక రచించారు.
పారిస్ క్లైమేట్ ఒప్పందాన్ని ట్రంప్ రద్దు చేసుకోగా బిడెన్ మళ్ళీ ఆ రద్దుని నిలిపివేస్తూ పారిస్ క్లైమేట్ లో భాగస్వామి అయ్యారు.ఇస్లామిక్ దేశాల నుంచీ వచ్చే ముస్లింలపై ఉన్న ఆంక్షలను ఎత్తేసారు.
ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సరిహద్దు గోడ నిధులని అర్ధంతరంగా నిలిపివేస్తూ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టించింది.ఇదిలాఉంటే.
అక్రమ వలస దారులు సరిహద్దుల నుంచీ వచ్చే క్రమంలో వారి పిల్లలను నిర్భంధించి తల్లి తండ్రులకు దూరం చేస్తూ ట్రంప్ పొందిన పైశాచిక ఆనందంపై కూడా బిడెన్ మండిపడ్డారు.తక్షణమే పిల్లలను తల్లి తండ్రుల నుంచీ విడదీసే పాలసీ రద్దు చేశారు.
జాత్యహంకార దాడుల విషయంలో కటినమైన వైఖరిని చూపించిన బిడెన్ తుపాకీ సంస్కృతి కట్టడిపై ఎలాంటి ముందడుగు వేయలేక పోయారు.అలాగే ఆఫ్ఘాన్ నుంచీ బలాలను వెనక్కి రప్పించడంతో ఎన్నో విమర్సల పాలయ్యారు.
కరోనా కట్టడి చేస్తానని చెప్పిన బిడెన్ ఆదిసాగా ప్రయత్నాలు చేసినా అవి ఫలితాలు ఇవ్వలేక పోయాయి.అమెరికన్స్ కు వ్యాక్సినేషన్ పై అవగాహన కల్పించడంలో బిడెన్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి.
అయితే ఒమిక్రాన్ అమెరికాపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపడంతో బిడెన్ పాలనపై విమర్శలు మొదలయ్యాయి.అయితే బిడెన్ ఏడాది పాలనను బేరీజు వేసుకుంటే అమెరికన్స్ దృష్టిలో బిడెన్ హిట్ అయ్యారనే చెప్పాలి.