చైనా యాప్ లకు బిడెన్ గ్రీన్ సిగ్నల్....పాత ప్రేమ చిగురించిందా...

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారం చేపట్టిన తరువాత పలు కీలకమైన పనులకు శ్రీకారం చుడుతూ వచ్చారు.అలాగే పనిలో పనిగా అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను సైతం బిడెన్ రద్దు చేస్తున్నారు.

 Biden Withdraw Ban Orders On China Apps Tik Tok Wechat-TeluguStop.com

ట్రంప్ విధానాలలో కొన్నిటిని అమలు చేస్తున్నారు కూడా.ట్రంప్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఎన్నికల హామీలలో ప్రధానంగా ఉన్న సరిహద్దు గోడ నిర్మాణ నిధుల విషయంలో బిడెన్ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేసేశారు.

తాజాగా ట్రంప్ చైనా యాప్ లపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

 Biden Withdraw Ban Orders On China Apps Tik Tok Wechat-చైనా యాప్ లకు బిడెన్ గ్రీన్ సిగ్నల్….పాత ప్రేమ చిగురించిందా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

భారత్ చైనా యాప్ లపై నిషేధం విధించిన తరువాత అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం చైనా యాప్ లపై నిషేధం అమలు చేశారు.

ఫలితంగా అత్యంత పాపులర్ అయిన టిక్ టాక్ పై తీవ్ర ప్రభావం పడింది.అమెరికా తరువాత దాదాపు అన్ని దేశాలు టిక్ టాక్ , పలు చైనా యాప్స్ పై నిషేధం విధించాయి.

దాంతో చైనా పై పరోక్షంగా పగ తీర్చుకున్నట్టుగా భావించారు.అయితే బిడెన్ మాత్రం ఇప్పుడు ఈ చైనా యాప్ లపై సున్నితంగా స్పందిస్తున్నారు.

తాజాగా టిక్ టాక్, వీ చాట్ , పలు చైనా యాప్ లపై నిషేధం విధిస్తూ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలపై మళ్ళీ సమీక్ష జరపాలని బిడెన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.దేశ భద్రతకు ముప్పు ఉండనే ఆరోపణలతో చైనా యాప్ లపై నిషేధం విధించారని అందులో ఉన్న వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు.కాగా అమెరికా భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు లేకపోతే ఉపసంహరణకు బిడెన్ సిద్దంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు అమెరికా వాణిజ్య శాఖకు బిడెన్ ఆదేశాలు జారీ చేశారు.

#TrumpBan #China Apps #JoeBiden #Joe Biden #America

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు