భారతీయులకు శుభవార్త.. గ్రీన్‌కార్డ్‌ జారీలో జాప్యంపై బైడెన్ ఫోకస్: వైట్‌హౌస్ వర్గాలు

అమెరికా కల నెరవేర్చుకునే ప్రస్థానంలో చివరి మజిలీ గ్రీన్ కార్డు.హెచ్ 1 బీ సహా ఇతర వీసాల సాయంతో అగ్రరాజ్యంలో అడుగుపెట్టిన వలసదారులకు గ్రీన్ కార్డు వస్తే ఇక జీవితంలో ఎలాంటి చీకూ చింతా వుండదు.

 Biden Wants To Address Delays In Green Card Processing System White House , Bide-TeluguStop.com

అయితే అది అనుకున్నంత తేలిక కాదు.ఎందుకంటే అమెరికాకు వచ్చే వలసల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది.

దీంతో గ్రీన్ కార్డుల కేటాయింపు ఆ దేశ ప్రభుత్వానికి కత్తిమీద సాములా తయారైంది.ఇతర దేశాల సంగతి పక్కనబెడితే.

గ్రీన్ కార్డుల కోసం ఎక్కవగా పడిగాపులు కాస్తోంది భారతీయులే.

తీవ్రమైన పోటీ నేపథ్యంలో గ్రీన్‌కార్డులపై అమెరికా ప్రభుత్వం కోటా తీసుకొచ్చింది.

దీని ప్రకారం ప్రతి దేశానికి 7 శాతం చొప్పున గ్రీన్‌కార్డులు జారీ చేస్తూ వస్తోంది అమెరికా.ఈ విధానంలో తక్కువ జనాభా వున్న దేశాలకు ఎక్కువగా గ్రీన్ కార్డులు మంజూరవుతుండగా.

భారత్, చైనా వంటి పెద్ద దేశాలకు ఏడు శాతం నిబంధన ప్రకారం కేటాయించే గ్రీన్‌కార్డులు ఏ మూలకు సరిపోవడం లేదు.దీనికి తోడు గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్‌లో మితిమీరిన జాప్యం భారతీయ టెక్కీలతో పాటు విదేశీయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.

ఈ నేపథ్యంలో ఈ సమస్యపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దృష్టి పెట్టినట్లు వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ శుక్రవారం మీడియాకు తెలిపారు.

ఇదే సమయంలో అక్టోబర్ 1 నాటికి దేశంలో 80,000 వేల ఉపాధి ఆధారిత గ్రీన్‌కార్డులు వృథాగా పడివున్నాయన్న సమస్యకు ఆమె స్పందించారు.

యూఎస్‌సీఐఎస్ వద్ద మిలియన్లకొద్దీ దరఖాస్తులు పెండింగ్‌లో వున్నాయని జెన్‌సాకీ చెప్పారు.దశాబ్ధాలుగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెక్కీలకు సమస్య పరిష్కారమయ్యేలాగా చట్టపరమైన మార్పులు చేయాలని బైడెన్ ఇప్పటికే కాంగ్రెస్‌ను కోరారని ఆమె తెలిపారు.

Telugu Biden, Bidenaddress, Indian, Uscis, White, Whitepress-Telugu NRI

కాగా, ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ ప్రతిపాదిత బిల్లు కాపీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.దీని ప్రకారం ప్రయారిటీ డేట్ దాటి రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగ ఆధారిత వలసదారులు 5000 డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసం పొందొచ్చు.అదే ఈబీ-5 వీసాదారులు అయితే 50 వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.అలాగే కుటుంబ ఆధారిత వలసదారులు గ్రీన్కార్డు పొందేందుకు 2500 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.దరఖాస్తుకు చెల్లించే సాధారణ రుసుముకు అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube