ఆ వీసాలపై బ్యాన్ ఎత్తేయండి, అమెరికాను ఆదుకోండి: బైడెన్‌కు సెనేటర్ల లేఖ

విదేశీయులు ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్‌1 బీతో పాటు మరికొన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.అయితే వీటిపై బ్యాన్‌ను ఎత్తివేయాలంటూ డెమొక్రాట్ పార్టీలోని ఐదుగురు శక్తివంతమైన సెనేటర్లు మైఖేల్ బెన్నెట్, జీన్ షాహీన్, అంగస్ కింగ్, కోరి బుకర్, బాబ్ మెనెండెజ్‌లు అధ్యక్షుడు జో బైడెన్‌ను కోరారు.

 Biden Urged To Revoke Trump Era Ban On H-1b And Other Foreign Work Visas, Indian-TeluguStop.com

ట్రంప్ విధించిన నిషేధం అమెరికన్ కంపెనీలు సహా, విదేశీయులు, వారి కుటుంబాల్లో అనిశ్చిత వాతావరణాన్ని సృష్టిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.గతేడాది జూన్‌లో ట్రంప్ 10,052 ప్రకటన చేశారని.

దీని ప్రకారం అమెరికన్ల ఉపాధికి ప్రమాదం వుందని ఆరోపిస్తూ .హెచ్ 1బీ, ఎల్ 1, హెచ్ 2బీ, జే 1 వీసాల ప్రాసెసింగ్‌ను నిలిపివేశారని వారు వెల్లడించారు.ఈ నిషేధం ఈ నెల 31తో ముగియనుంది.విదేశీ వీసాదారుల వల్ల అమెరికన్ కార్మికులకు వచ్చిన ఇబ్బంది ఏం లేదని సెనేటర్లు చెప్పారు.అలాగే విదేశీ కార్మికులపై ఆధారపడి వ్యాపారాలు నిర్వహించే కంపెనీలు ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వారు అధ్యక్షుడికి రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

భారత్, చైనా వంటి దేశాల నుంచి ప్రతి ఏటా కనీసం 10 వేల మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకునేందుకు అమెరికన్ల టెక్ కంపెనీలు హెచ్ 1 బీ వీసాపై ఆధారపడుతున్నాయి.

ట్రంప్ విధించిన నిషేధం.ప్రతిభావంతులైన వ్యక్తులను యూనైటెడ్ స్టేట్స్‌కు రాకుండా చేయడమే కాకుండా, అత్యుత్తమ మానవ వనరులు ఇతర దేశాలను తమ ప్రత్యామ్నాయంగా ఎంచుకునే ప్రమాదం వుందని సెనేటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

అందువల్ల ట్రంప్ చేసిన 10,052 ప్రకటనను ఆలస్యం చేయకుండా ఉపసంహరించుకోవాలని , వలసేతర వీసాల ప్రాసెసింగ్‌ను తిరిగి ప్రారంభించాలని సెనేటర్లు అధ్యక్షుడిని కోరారు.

Telugu Company, Trump-Telugu NRI

అలాగే వీసా ప్రాసెసింగ్ కోసం యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్‌లకు ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.ఆర్ధిక వ్యవస్ధ పునరుద్దరణ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఖాళీగా వున్న టెక్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు విదేశీ కార్మికుల లేమి వల్ల సమస్య మరింత జఠిలమవుతుందని సెనేటర్లు పేర్కొన్నారు.ఇప్పటికే ఈ నిషేధం కారణంగా హెచ్ 1 బీ వీసాల కింద లభించే ఉద్యోగాలు ఖాళీగా వుండటంతో పాటు అవి శాశ్వతంగా విదేశాలకు తరలిపోవడమో జరిగిందని చెప్పారు.

కనుక పరిస్థితి చేయి దాటకముందే తగిన నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అని సూచించారు.ప్రస్తుతం దేశ ఐటీ కంపెనీల్లో ఏర్పడిన ఉద్యోగుల కొరతను తీర్చేందుకు వెంటనే విదేశీ టెకీలను నియమించుకునే అవకాశం ఇవ్వాలని సెనేటర్లు అధ్యక్షుడిని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube