స్వీడన్‌లో అమెరికా రాయబారిగా ఎరిక్ రామనాథన్.. నామినేట్ చేయనున్న జో బైడెన్

అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ గెలిస్తే.ఖచ్చితంగా భారతీయులకు కీలక పదవులు లభిస్తాయని అనేక సర్వేల్లో తేలింది.

 Biden To Nominate Indian American Erik Ramanathan As Envoy To Sweden , Eric Rama-TeluguStop.com

ఇందుకు తగినట్లుగానే అగ్ర రాజ్యాధినేతగా పగ్గాలు అందుకున్న క్షణం నుంచి నేటి వరకు ఇండో అమెరికన్లకు కీలక పదవులు అప్పగించారు జో బైడెన్.తాజాగా మరో భారత సంతతి వ్యక్తిని కీలక పదవికి నామినేట్ చేయనున్నారు బైడెన్.

తన చిరకాల మిత్రుడు, అనుచరుడు ఎరిక్ రామనాథన్‌ను ‌స్వీడన్‌లో అమెరికా రాయబారిగా నియమించాలని ఆయన నిర్ణయించారు.ప్రస్తుతం ఎన్జీవో సంస్థ హెలూనా హెల్త్‌కు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు రామనాథన్.

పబ్లిక్ హెల్త్, తల్లిపిల్లల ఆరోగ్యం, పోషకాహారం, అక్షరాస్యత, అంటు వ్యాధులు, వ్యసనాలు, కోవిడ్ 19 తదితర సమస్యలపై 500కి పైగా కార్యక్రమాలతో 80 మిలియన్ల మంది అమెరికన్లకు ఈ సంస్థ సేవ చేస్తోంది.

పబ్లిక్ బయోటెక్నాలజీ కంపెనీ అయిన ఇమ్‌క్లోన్ సిస్టమ్స్ జనరల్ కౌన్సిల్‌గా సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా రామనాథన్ గతంలో వ్యవహరించారు.

అలాగే హార్వర్డ్ లా స్కూల్ ప్రోగ్రామ్‌కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గానూ వున్నారు.అంతేకాకుండా న్యూ పాలిటిక్స్ లీడర్‌షిప్ అకాడమీ, షాడీ హిల్ స్కూల్, ఇమ్మిగ్రేషన్ ఈక్వాలిటీ వంటి లాభాపేక్షలేని బోర్డులలో కీలకపాత్ర పోషించారు.

రామనాథన్.జాన్స్ హప్కిన్స్ విశ్వవిద్యాలయంలో బీఏ, హార్వర్డ్ లా స్కూల్ నుంచి జేడీ పట్టా పొందారు.

హెల్త్‌కేర్ అటార్నీగా ఆయన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.

రామనాథన్ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ లీడర్‌గా మూడు దశాబ్ధాల పాటు సేవలందించారు.

ఎల్‌‌జీబీటీక్యూ, హెచ్ఐవీ, అస్లీ కమ్యూనిటీలకు సేవ చేసినందుకు గాను ప్రతిష్టాత్మక గ్లోబల్ విజన్ అవార్డు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.డెమొక్రాటిక్ పార్టీకి గట్టి మద్ధతుదారైన ఎరిక్ రామనాథన్.

డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ అనుబంధ నేషనల్ ఫైనాన్స్ కమిటీలలో పనిచేశారు.

Telugu Bidennominate, Eric Ramanathan, Joe Biden, Seniorimclone-Telugu NRI

రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించుకోవడానికి, ప్రతిభావంతులైన దౌత్యవేత్తల బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు ఎరిక్ ఒక ప్రకటనలో తెలిపారు.కోవిడ్ 19 నుంచి వాతావరణ మార్పుల వరకు అనేక సవాళ్లను ఎదుర్కొనే సహకారాన్ని బలోపేతం చేసుకుంటామని రామనాథన్ చెప్పారు.వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, మానవ హక్కులతో సహా స్వీడన్‌తో అమెరికా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube