సిద్దంగా ఉండండి...అమెరికన్స్ కి సీరియస్ వార్నింగ్..!!

అగ్ర రాజ్యం అమెరికాలో ఎన్నికల హడావిడి అయ్యిపోయింది.అధ్యక్షుడిగా బిడెన్ జనవరి 30 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

 Biden Sworn In On January 30th, Thanksgiving Day, Corona Outbreak, Christmas Hol-TeluguStop.com

నిన్న మొన్నటి వరకూ ఎన్నికల హడావిడి, బహిరంగ సభలు, ఇరు పార్టీల మధ్య పోటా పోటీ మాటలతో ప్రజలు కరోనా నుంచి దృష్టి మరలడమే కాదు బహిరంగంగా ఎప్పటిలా తిరిగేసారు.ఇక ఇప్పుడు కరోనా టైం స్టార్ట్ అయ్యింది.

వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్టుగా కరోనా తీవ్రస్థాయిలో తన ఆట మొదలు పెట్టింది.మెల్ల మెల్లగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలోనే అమెరికన్స్ అందరూ ఉలిక్కిపడేలా అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని పౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

థాంక్స్ గివింగ్ డే ఎంత సంతోషాన్ని ఇచ్చిందో ఇప్పుడు అంతకంటే విషాదాన్ని ఇవ్వబోతోందని ఆయన గుండెలు ఆగిపోయేలా వ్యాఖ్యలు చేశారు.

త్వరలో మళ్ళీ గతంలోలా సీన్ రిపీట్ అవ్వబోతోందని, కేసుల మీద కేసులు పెరగనున్నాయని అన్నారు.లక్షలాది అమెరికన్స్ థాంక్స్ గివింగ్ సందర్భంగా దేశ వ్యాప్తంగా పర్యటనలు చేసి ఇళ్ళకు చేరుకున్నారని, ఈ క్రమంలో కరోనా వ్యాప్తి వేగావంతంగా జరిగిందని ఆయన తెలిపారు.

కేవలం రెండు వారాలలో కేసుల ప్రభావం పెరుగుతుందని అందరూ ఇందుకు సిద్దంగా ఉండాలని తెలిపారు.అయితే ఎవరినీ భయపెట్టడానికి ఈ విషయాలు చెప్పడం లేదని ఇది నిజమని ప్రకటించారు.అంతేకాదు

Telugu Bidensworn, Corona Outbreak, Corona Vaccine, Day-Telugu NRI

అతి త్వరలో క్రిస్మస్ సెలవలు కూడా రానున్నాయని దాంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.వ్యాక్సిన్ అందించే విషయంలో తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని వ్యాక్సిన్ తయారు సంస్థలు తెలిపాయి.ప్రస్తుతానికి వ్యాక్సిన్ పని తీరపై చివరిదశ ప్రయోగాలు జరుగుతున్నాయని, 95 శాతం సక్సెస్ అయ్యామని అంటున్నాయి.ఇదిలా ఉంటే డిసెంబర్ నెలాఖరులోగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలని ప్రభుత్వం ఫార్మా కంపెనీలపై ఒత్తిడి తెస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube