కమలా హారీస్ కి మద్దతుగా నిలిచినా డెమోక్రటిక్ పార్టీ..!!!

భారత సంతతికి చెందిన కమలా హారీస్ 2020 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న విషయం తెలిసిందే.ఎంతో చురుకైన వ్యాఖ్యలతో ఆకట్టుకునే ప్రసంగాలతో దూసుకుపోతున్న హారీస్ పై అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు బిడెన్ మండిపడుతున్నారు.

 Biden Support Kamala Haris 1 1tstop-TeluguStop.com

ఆయన మద్దతుదారులు హారీస్ పై విమర్శలు ఎక్కు పెడుతున్నారు.దాంతో డెమోక్రటిక్ పార్టీ నేతలు అందరూ హరీస్ కి మద్దతుగా నిలిచారు.

గత కొన్ని రోజులుగా ఆమెపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు అందరికి తెలిసిందే.తాజాగా జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జాతి వివక్షకి సంభందించిన అంశాలపై హారీస్ కి సవాలు విసిరారు బిడెన్.

అయితే ఈ సవాలుపై స్పందించిన బిడెన్‌ అనుచరగణం సోషల్ మీడియాలో ప్రతివిమర్సలు చేస్తూ దాడి మొదలు పెట్టారు.ఆమె కేవలం నల్ల జాతికి చెందిన వ్యక్తిగా చెప్తోందని, ఆమె నల్ల జాతీయురాలు కాదని వ్యాఖ్యలు చేశారు.

హారీస్ తండ్రి జమైకా జాతీయుడని, తల్లి భారతీయ మహిళ అంటూ ప్రచారం ప్రారంభించారు.అయితే ఈ ప్రచారాన్ని ఖండిస్తూ హారీస్ ప్రచార ప్రతినిధి గట్టిగా బదులు ఇచ్చారు.

ఆమె కి వస్తున్న ఆదరణ చూసి ఈ రకమైన ప్రచారం చేస్తున్నారని ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పారేశారు.డెమోక్రటిక్ పార్టీ నేతలతో పాటుగా, ఆమె మద్దతు ప్రజలు సైతం ఆమెకి అండగా నిలుస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube