స్లోవేకియాలో అమెరికా రాయబారిగా ఇండో అమెరికన్ దౌత్యవేత్త..!

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొలువులో భారత సంతతికి చెందిన వ్యక్తులు కీలక పదవులు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ లిస్ట్ భారీగా పెరిగిపోగా… సొంత పార్టీ నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ బైడెన్ వెనక్కి తగ్గడం లేదు.

 Biden Set To Nominate Indian-american Diplomat Gautam Rana As Ambassador To Slovakia , Slovakia , Joe Biden, Indo-american Diplomat Gautam Rana, Deputy Chief Of Mission To The Us Embassy In Algeria, European, Eurasia-TeluguStop.com

తాజాగా ఇండో అమెరికన్ దౌత్యవేత్త గౌతమ్ రానాను స్లోవేకియాలో అమెరికా రాయబారిగా నామినేట్ చేయాలని అధ్యక్షుడు నిర్ణయించారు.బుధవారం విడుదల చేసిన ప్రకటనలో రానా నామినేషన్‌ను తదుపరి ఆమోదం కోసం పంపాలని బైడెన్ నిర్ణయించినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది.

సీనియర్ ఫారిన్ సర్వీస్ ఉద్యోగి అయిన రానా ప్రస్తుతం అల్జీరియాలోని యూఎస్ ఎంబసీకి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా వ్యవహరిస్తున్నారు.2020 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు అక్కడ తాత్కాలికంగా ఛార్జ్ డి ఎఫైర్స్ హోదాలో పనిచేశారు.అంతకుముందు స్లోవేనియాలోని లుబ్లాజానాలోని యూఎస్ ఎంబసీలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్, తాత్కాలిక చార్జ్ డి ఎఫైర్స్‌గా విధులు నిర్వర్తించారు.అలాగే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్టాఫ్ డైరెక్టర్‌గా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లలో పనిచేశారు.

 Biden Set To Nominate Indian-American Diplomat Gautam Rana As Ambassador To Slovakia , Slovakia , Joe Biden, Indo-American Diplomat Gautam Rana, Deputy Chief Of Mission To The US Embassy In Algeria, European, Eurasia-స్లోవేకియాలో అమెరికా రాయబారిగా ఇండో అమెరికన్ దౌత్యవేత్త..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో పాటు న్యూఢిల్లీలోని యూఎస్ ఎంబసీలో రాజకీయ వ్యవహరాల డిప్యూటీ మినిస్టర్ కౌన్సెలర్‌గా వున్నారు.

గతంలో డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌కు స్పెషల్ అసిస్టెంట్‌గా … యూరోపియన్, యురేషియా వ్యవహారాల సహాయ కార్యదర్శికి స్పెషల్ అసిస్టెంట్‌గా కూడా పనిచేశారు.అలాగే ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ దేశాలలో పలు హోదాల్లో పనిచేశారు.ఇంగ్లీష్‌తో పాటు హిందీ, స్పానిష్, గుజరాతీ భాషల్లో గౌతమ్ రానా అనర్గళంగా మాట్లాడగలరు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube