బిడెన్ కీలక నిర్ణయం..రంగంలోకి మిలటరీ సిబ్బంది...!!!

Biden Key Decision Military Personnel Enter The Field

అమెరికాలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది.ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో ఒమిక్రాన్ కేసుల నమోదు అవడంలేదు, రోజు రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవడంతో అమెరికాలో పరిస్థితులపై ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు.

 Biden Key Decision Military Personnel Enter The Field-TeluguStop.com

గతంలో వచ్చిన వేరియంట్స్ కంటే కూడా అత్యంత వేగంగా ఈ మహమ్మారి ప్రభలడంతో భవిష్యత్తులో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయోనని నిపుణులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.మరో పక్క ఇబ్బడిముబ్బడిగా కేసుల పెరగడంతో ఆసుపత్రులకు ప్రజలు క్యూ కడుతున్నారు.

దాంతో.

 Biden Key Decision Military Personnel Enter The Field-బిడెన్ కీలక నిర్ణయం..రంగంలోకి మిలటరీ సిబ్బంది…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆసుపత్రులలో వైద్యులు, సిబ్బంది కొరత ఏర్పడటంతో సకాలంలో వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ పరిస్థితులపై స్పందించిన అధ్యక్షుడు బిడెన్ తక్షణమే సహయా చర్యలు చేపట్టాలంటూ అమెరికా మిలటరీకి ఆదేశాలు జారీ చేశారు.కరోనా వేగంగా విస్తరిస్తున్న సుమారు 6 రాష్ట్రాలలో సైనిక చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు.

తక్షణ చర్యలు చేపట్టాల్సిన ప్రాంతాలకు మిలటరీ ఆరోగ్య కార్యకర్తలను పంపుతామని తెలిపారు.ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అవసరమైన సహాయక చర్యలు కార్యకర్తలు చేపడుతారని తెలిపారు.

ప్రజలకు ఉచితంగా మాస్క్ లు , వైద్య పరీక్షలు చేస్తామని రోగుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపధ్యంలో ఆసుపత్రులలో సిబ్బంది కొరత ఉంటోందని, ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అందరికి సరైన సమయంలో వైద్యం అందుతుందని త్వరలో మిలటరీ ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులోకి వస్తారని ప్రకటించారు.ఇదిలాఉంటే న్యూయార్క్, న్యూజెర్సీ, ఒహియో లలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి.

ప్రస్తుతం అమెరికాలో కరోనతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని, అయితే ఈ మరణాలు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కు చెందినవి కదాని, ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగుతున్నా మరణాల విషయంలో పెద్దగా ప్రభావం చూపడం లేదని నిర్ధారించారు పరిశోధకులు

.

Biden Key Decision Military Personnel Enter The Field , Biden, Military Personnel, America, Omicron Cases - Telugu America, Biden, Bidenkey, Omicron

#America #Biden #Omicron #BidenKey

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube