బిడెన్ మరో కీలక నిర్ణయం...భారతీయులకు భారీ ఊరట..!!

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధ్యక్షుడు అయ్యింది భారతీయుల కోసమేనేమో అనిపిస్తుంది ఒక్కో సారి.బిడెన్ తీసుకునే ఒక్కో నిర్ణయం భారతీయులకు వరంగా మారుతోంది.

 Biden Is Another Key Decision  A Huge Blow To Indians, Joe Biden, H-1b Visa, Tru-TeluguStop.com

అధ్యక్షుడు నిర్ణయం వలస వాసులు అందరికి వర్తించినా వలసలు వచ్చిన వారిలో అత్యధికులు భారతీయులు కావడంతో లబ్ది పొందే వారిలో ముందు భారతీయులేనిలబుతున్నారు.తాజాగా బిడెన్ తీసుకున్న మరో కీలక నిర్ణయం ఎంతో మంది భారతీయులకు ఊరట నిచ్చింది.

హెచ్ –1బి వీసాపై అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగుల కనీస వార్షిక వేతనాన్ని డోనాల్డ్ ట్రంప్ తన హాయంలో 65 వేల డాలర్ల నుంచీ, లక్షా పదివేల డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయం కారణంగా లక్షా పదివేల డాలర్ల వార్షిక వేతనం కంటే తక్కువ ఉన్న వారు వారి వారి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందే.

దాంతో ఈ విషయంపై భారతీయ టెకీలు, ఐటీ కంపెనీలు ఆందోళన చెందాయి.ఈ నిర్ణయం మార్చి -15 నుంచీ అమలులోకి రానున్న నేపధ్యంలో బిడెన్ ట్రంప్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ ఉత్తరువులు జారీ చేశారు.

ఈ అమలును సుమారు 60 రోజులు వాయిదా వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఈ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చే వరకూ వాయిదా కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు బిడెన్.

ఈ నిర్ణయం భారతీయ టెకీలు, నిపుణులకు భారీ ఊరట కలిగించింది.ఇదిలాఉంటే బిడెన్ తీసుకున్న నిర్ణయంపై ఫెడరేషన్ ఆఫ్ అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యతిరేకించింది.

ట్రంప్ నిర్ణయం సరైనదని, అలా చేయడం వలన కేవలం నిపుణులు మాత్రమే అమెరికాలో ఉంటారని.అమెరికన్స్ కు మంచి అవకాశాలు దొరుకుతాయని తెలిపింది.

అయితే ఒక సారి బిడెన్ తీసుకున్న నిర్ణయంలో మార్పు ఉండదని అమెరికా ప్రెస్ సెక్రటరీ సాకీ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube