థర్డ్ వేవ్.ప్రపంచ వ్యాప్తంగా అందరిని టెన్షన్ పెట్టిస్తున్న ఏకైక పేరు.
కరోనా మహమ్మారి తగ్గ్గుతోంది అనుకుంటున్న క్రమంలో తనలో మార్పులు చేసుకుంటూ కాలానికి అనుగుణంగా మరింత తీవ్రంగా, బలంగా మారుతున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం అమెరికాలో విరుచుకుపడుతోంది.సెకండ్ వేవ్ సమయంలో భారత్ లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికి తెలిసిందే.
థర్డ్ వేవ్ పరిస్థితి గత వేరియంట్ లకంటే ఆందోళన కలిగించేలా ఉందని అంటున్నారు నిపుణులు.ఈ క్రమంలోనే ఆంటోని ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోని అమెరికాలో తాజా పరిస్థితులపై ఆందోళన వక్తం చేశారు.అమెరికా అధికారులు కరోనా విషయంలో తప్పుడు మార్గంలో వెళ్తున్నారని, అమెరికాలో రోజు రోజుకు కేసులు పెరిగిపోవడం పై ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
మహమ్మారిని ఎదుర్కునేందుకు అధికారులు అనుసరిస్తున్న మార్గం సరైనది కాదని, తప్పుడు మార్గంలో అధికారులు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు.

అంతేకాదు అమెరికా వ్యాప్తంగా ఉన్న ప్రజలలో కేవలం సగం మంది మాత్రమే వ్యాక్సిన్ ను తీసుకున్నారని, సగానికి సగం మంది వ్యాక్సిన్ తీసుకోలేదని, అమెరికాకు ఇది అతిపెద్ద సమస్య కానుందని అన్నారు.అలాగే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు మాస్క్ లు ధరించాల్సిన అవసరం లేదని సిడిసి చెప్పడం వలన ఎంతో మంది అమెరికన్స్ మాస్క్ లు ధరించలేదని, అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఇదేనని ఫౌచీ అభిప్రాయపడ్డారు.లాస్ ఏంజిల్స్ లో మాస్క్ లు తప్పనిసరి చేస్తూ ఆ రాష్ట్రం మంచి నిర్ణయం తీసుకుందని, ఇదే బాటలో పలు రాష్ట్రాలు ఉన్నాయని వారు చేసే పని సరైనదని అన్నారు.
రానున్న రోజుల్లో కరోనా మరణాల తీవ్రత భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, ఇప్పటికనా అధికారులు మేల్కోక పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.