కార్చిచ్చులపై బైడెన్ ఫోకస్: బాధిత ప్రాంతాల్లో పునర్నిర్మాణానికి సర్వే, భారీ ప్రణాళికలు

గడిచిన కొన్నేళ్లుగా అమెరికాలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి.గతం సంగతి పక్కనబెడితే.

 Biden Focus On Burns Survey For Reconstruction In Affected Areas Huge Plans-TeluguStop.com

గత రెండేళ్లుగా ఈ దావాగ్ని లక్షలాది హెక్టార్ల అటవీని కాల్చిబూడిద చేసింది.ఇదొక్కటే కాదు దీని వల్ల వన్య ప్రాణులు సైతం బూడిద కుప్పగా మారాయి.

ఇక ఇళ్లు , ఆస్తులు, వాహనాలు కోల్పోయి నిరాశ్రయులైన వారి సంఖ్య లెక్కేలేదు.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కార్చిచ్చులపై ఫోకస్ పెట్టారు.

 Biden Focus On Burns Survey For Reconstruction In Affected Areas Huge Plans-కార్చిచ్చులపై బైడెన్ ఫోకస్: బాధిత ప్రాంతాల్లో పునర్నిర్మాణానికి సర్వే, భారీ ప్రణాళికలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దావాగ్ని వల్ల భారీగా నష్టపోయిన ప్రాంతాల్లో పునర్నిర్మాణ చర్యలు చేపట్టాలని ఆయన భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో కార్చిచ్చు రేగడం వల్ల కాలిఫోర్నియాలో జరిగిన నష్టాన్ని సర్వే చేయడం కోసం ఇదాహోలోని అగ్నిమాపక అధికారులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా బాధిత ప్రాంతాల్లో 3.5 ట్రిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ప్రణాళికలు రూపొందించాలని బైడెన్ సూచించారు.వాతావరణ మార్పుల వల్ల కార్చిచ్చులు మరింత శక్తిని పుంజుకుంటున్నాయని ఆయన అన్నారు.విపత్తుల విషయంలో ఎరుపు, నీలం రాష్ట్రాలన్న పక్షపాతం తమ ప్రభుత్వానికి లేదని అధ్యక్షుడు స్పష్టం చేశారు.

ఇక్కడ పునర్నిర్మాణ కార్యక్రమానికి సహాయపడటానికి తన పరిపాలనా యంత్రాంగాన్ని వార్ టైమ్‌ లా ను ఉపయోగించాలని ఆయన సూచించారు.

Telugu Affected Areas, America, Biden Call Movment, Code Red Movement, Focus On Burns, Huge Plans, Joe Biden, Kaliforniya, Reconstruction, War Time Law-Telugu NRI

యూఎస్ ఫారెస్ట్ సర్వీస్ ప్రాథమిక ఫైర్‌హౌస్ సరఫరాదారు నుంచి సరఫరాను పెంచేందుకు గాను ఆగస్టు ప్రారంభంలో రెండోసారి రక్షణ ఉత్పత్తి చట్టాన్ని అధికారులు ప్రయోగించారు.అంతకుముందు దేశంలో కోవిడ్ మహమ్మారిని నియంత్రించేందుకు గాను టీకాల సరఫరాను పెంచే ఉద్దేశ్యంతో అధ్యక్షుడు ఈ చట్టాన్ని ఉపయోగించాడు.తాజాగా మరోసారి రక్షణ ఉత్పత్తి చట్టాన్ని ప్రయోగించడం వల్ల 415 మైళ్ల ఫైర్‌హోస్‌ ఉత్పత్తి చేయడానికి, రవాణా చేయడానికి అవసరమైన సామాగ్రిని పొందడానికి , పశ్చిమ అమెరికా అంతటా మరో వినాశకరమైన అడవి మంటల సీజన్‌ను పరిష్కరించవచ్చన్నది బైడెన్ ప్లాన్.

కొద్దిరోజుల క్రితం ఇడా హరికేన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన న్యూయార్క్, న్యూజెర్సీ, లూసియానాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా వాతావరణ మార్పులపై తగిన చర్యలు తీసుకోవడానికి కోడ్ రెడ్ ఉద్యమానికి జో బైడెన్ పిలుపునిచ్చారు.వాతావరణ మార్పు మన జీవితాలకు, ఆర్ధిక వ్యవస్థ అస్తిత్వ ముప్పును కలిగిస్తుందని న్యూయార్క్ పర్యటన సందర్భంగా అధ్యక్షుడు అన్నారు.

#Biden #America #Joe Biden #Kaliniya #Affected Areas

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు