బిడెన్ ఏంటిది : అమెరికా ప్రజల సొమ్ము వృధా...జాతీయ ముప్పుగా మారే అవకాశం..

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధికారం చేపట్టిన తరువాత అనవసర ఖర్చులు తగ్గిపోతాయని, అమెరికాను గాడిలో పెట్టేందుకు పెద్ద ఎత్తులో ఆర్ధిక సంస్కరణలు ఉంటాయని ఓ రేంజ్ లో క్లాసులు పీకారు.అలాగే ప్రతీ ఒక్క ఉద్యోగి భాద్యతగా నడుచుకోవాలని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు ఎవరైనా చేస్తే వారిపై కటినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

 Joe Biden Spending Two Billion Dollars To Stop Border Wall Construction, Joe Bid-TeluguStop.com

అయితే ఇప్పుడు బిడెన్ భాద్యతా రహితంగా నడుచుకుంటున్నారని ప్రజల సొమ్మును వృధా చేస్తూ వృధా చేయడానికి కూడా కోట్ల డాలర్లు ఖర్చు చేస్తున్నారని , కేవలం ఒక గోడ నిర్మాణం ఆపడం కోసం రోజుకు కోట్లు ఖర్చు చేస్తున్నారంటూ రిపబ్లికన్ కాంగ్రెషనల్ ఓ నివేదికలో తెలిపింది.

ట్రంప్ హయాంలో సరిహద్దుల ద్వారా అమెరికాలోకి ఎవరూ ప్రవేశించకుండా ఉండేందుకు గోడ నిర్మాణం చేపట్టాలని భావించారు.

అందుకు తగ్గట్టుగా ట్రంప్ భారీ మొత్తంలో నిధులు కేటాయించడమే కాకుండా మిలటరీకి చెందిన కొన్ని నిధులను కూడా అందుకు మళ్ళించారు.చాలా మేరకు గోడ నిర్మాణం జరిగింది కూడా.

అయితే బిడెన్ అధికారంలోకి వచ్చిన తరువాత గోడ నిర్మాణానికి వెచ్చించిన నిధులను నిలిపేశారు.గోడ నిర్మాణం అవసరం లేదని ఆదేశాలు జారీ చేశారు.

కానీ గోడ నిర్మాణం ఇలా ఆర్ధంతరంగా ఆపేయడం వలన ప్రభుత్వంపై 2 బిలియన్ డాలర్ల భారం పడుతోందని రిపబ్లికన్ కాంగ్రెషనల్ ఆవేదన వ్యక్తం చేసింది.

Telugu Americans, Wall, Donald Trump, Joe Biden, Joebiden, Nri-Telugu NRI

గోడ నిర్మాణం కోసం తెచ్చిన ఉక్కు, సిమెంటు ను సరిహద్దుల్లో వదిలేసారని.కేవలం వీటిని కాపలా కాయడానికే ప్రభుత్వానికి రోజుకు 22 కోట్లు ఖర్చు అవుతోందని, తన నివేదికలో తెలిపింది.అయితే ఆపరేషన్స్ అండ్ బోర్డర్స్ మేనేజ్మెంట్ కోసం విధించిన ఒక సబ్ కమిటీ సైతం ప్రజలు కట్టే పన్నులు వృధాగా పోతున్నాయని దాంతో ఈ పరిణామాలు జాతీయ భద్రతకు ముప్పు తెచ్చే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

ఇదిలాఉంటే గోడ ఉన్న ప్రాంతాల సరిహద్దులలో అక్రమ వసలసదారుల ప్రవేశం లేదని, గోడ నిర్మాణం లేని ప్రాంతాల నుంచీ వలస వాసులు అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని నిపుణులు వాపోతున్నారు.బిడెన్ అధికారం చేపట్టిన తరువాత పరిస్థితులలో మార్పు వస్తుందని అనుకున్నామని కానీ ట్రంప్ , బిడెన్ లకు పెద్దగా తేడా లేదని అంటున్నారు పరిశీలకులు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube