బైడెన్ జట్టులోకి మరో ఇద్దరు భారతీయులు, కీలక బాధ్యతలు..!!

అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ బాధ్యతలు స్వీకరిస్తే ఆయన మంత్రివర్గంతో పాటు దేశంలోని కీలక పదవుల్లో భారతీయులకు వున్నత పదవులు దక్కుతాయని అమెరికాలో తొలి నుంచి ప్రచారం జరిగింది.అందుకు తగినట్లుగానే బైడెన్ వ్యవహరిస్తున్నారు.

 Biden Administration Appoints Two Indian-origin Experts To Key Positions, Biden,-TeluguStop.com

ఇప్పటికే 20 మందికిపైగా భారత సంతతి ప్రముఖులకు ఆయన కీలక బాధ్యతలు కట్టబెట్టారు.తాజాగా మరో ఇద్దరు ఇండో అమెరికన్లకు జో బైడెన్ తన జట్టులో చోటు కల్పించారు.

ఫెడరల్ ఏజెన్సీ అమెరికార్ప్స్‌‌ స్టేట్ అండ్ నేషనల్ డైరెక్టర్‌గా సోనాలి నిజావన్‌ను, సంస్థ విదేశీ వ్యవహారాల చీఫ్‌గా శ్రీ ప్రెస్టన్ కులకుర్ణిని బైడెన్ నియమించారు.

టెక్సాస్‌ నుంచి కాంగ్రెస్‌కు ఎన్నికయ్యేందుకు రెండు సార్లు ప్రయత్నించినప్పటికీ కులకర్ణి ఓటమిపాలయ్యారు.అయినప్పటికీ ఆయన సమర్థతను వాషింగ్టన్ నాయకత్వం గుర్తించింది.అమెరికార్ప్స్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.కులకర్ణి, నిజావన్‌ సహా డాన్‌ కోహ్ల్‌కు కీలక పదవులు దక్కాయి.వీరు కోవిడ్ 19, ఆర్ధిక పునరుద్ధరణ, జాతి సమానత్వం, వాతావరణ మార్పులపై పనిచేస్తారు.

రిపబ్లికన్లకు పట్టున్న టెక్సాస్ 22వ జిల్లాలో డెమొక్రాట్ నామినీగా కులకర్ణి గత నవంబర్‌లో ఫోర్ట్ బెండ్ కౌంటీ మాజీ షెరీఫ్ ట్రాయ్ నెహ్ల్ చేతిలో ఓడిపోయాడు.కాగా, విదేశాంగ విధానంలో కులకర్ణికి అపార అనుభవం వుంది.

ఆయన అమెరికా విదేశాంగ శాఖలో 14 ఏళ్లు విధులు నిర్వర్తించారు.ప్రజా వ్యవహారాలు, అంతర్జాతీయ సమాచార కార్యక్రమాలలో పనిచేశారు.

తైవాన్, రష్యా, ఇరాక్‌, ఇజ్రాయెల్, జమైకా‌లలో పర్యటించాడు.

Telugu Biden, Calinia, Indian, Kulkarni, Nizavan-Telugu NRI

ఇక సోనాలి విషయానికి వస్తే.కాలిఫోర్నియా డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పయనీర్స్‌గా పనిచేశారు.ఈ హోదాలో పట్టణ పాఠశాల వ్యవస్థలకు లాభాపేక్షలేని నిర్వాహకులను నియమించారు.

మార్క్వెట్ యూనివర్సిటీ నుంచి ఎడ్యుకేషన్, సైకాలజీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అందుకున్నారు సోనాలి.అలాగే బాల్టిమోర్‌లోని మేరీల్యాండ్ యూనివర్సిటీ నుంచి సోషల్ వర్క్‌లో మాస్టర్స్ చేశారు.

ఇక బైడెన్ జట్టులో కమలా హారిస్, నీరా టాండన్, డాక్టర్ వివేక్ మూర్తి, వినయ్‌ రెడ్డి,వేదాంత్‌ పటేల్‌,వనితా గుప్తా, ఉజ్రా జాయే, మాలా అడిగా,గరీమా వర్మ,సబ్రీన్ సింగ్, సమీరా ఫజిలి, భరత్ రామ్మూర్తి తదితరులు చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube