బిచ్చగాడు మళ్లీ వస్తాడట!  

Bichagadu Sequel On Cards - Telugu Bichagadu, Bichagadu Sequel, Tollywood News, Vijay Antony

తమిళంలో తెరకెక్కిన పిచ్చైక్కరన్ చిత్రాన్ని తెలుగులో ‘బిచ్చగాడు’ పేరుతో రిలీజ్ చేశారు.ఈ సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు నటుడు విజయ్ ఆంటోని.2016లో రిలీజ్ అయిన ఈ చిన్న బడ్జెట్ సినిమా తెలుగు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.ఈ సినిమాను మదర్ సెంటిమెంట్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంతో వారు ఈ సినిమాను బాగా ఆదరించారు.

 Bichagadu Sequel On Cards

ఇక ఈ సినిమా తరువాత విజయ్ ఆంటోని నటించిన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్నాడు.ఈ క్రమంలో గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న విజయ్, మరోసారి బిచ్చగాడు లాంటి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.

దీని కోసం మళ్లీ అదే సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.అయితే బిచ్చగాడు సీక్వెల్‌ను రెడీ చేసే పనిలో పడ్డాడట ఈ హీరో.లాక్‌డౌన్ కారణంగా బోలేడు సమయం దొరకడంతో బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌ కథను రెడీ చేసే పనిలో పడ్డాడట విజయ్.

బిచ్చగాడు మళ్లీ వస్తాడట-Gossips-Telugu Tollywood Photo Image

అన్నీ అనుకున్నట్లు కుదిరితే లాక్‌డౌన్ ముగియగానే ఈ సినిమాను పట్టాలెక్కించేందుకు విజయ్ ఆంటోనీ రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, టెక్నికల్ టీమ్ గురించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.ఏదేమైనా తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌లా నిలిచిన బిచ్చగాడు సినిమాకు సీక్వెల్‌తో రానున్న విజయ్‌కు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bichagadu Sequel On Cards Related Telugu News,Photos/Pics,Images..