కుర్ర హీరో సినిమాలో భూమిక ఏం చేస్తుందంటే?  

Bhumika Key Role In Sumanth Ashwin Movie, Bhumika, Anasuya Bharadwaj, Sumanth Ashwin, Tollywood News - Telugu Anasuya Bharadwaj, Bhumika, Sumanth Ashwin, Tollywood News

టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా తమ సత్తా చాటిన వారు వివిధ కారణాల వల్ల హీరోయిన్ పాత్రల నుండి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలకు మారిపోతుంటారు.ఈ కోవలో చాలా మంది మనకు కనిపించారు.

TeluguStop.com - Bhumika Key Role In Sumanth Ashwin Movie

కాగా ఒకప్పుడు ఖుషీ లాంటి బిగ్గె్స్ట్ బ్లాక్‌బస్టర్ మూవీతో హీరోయిన్‌గా సత్తా చాటిన భూమికా, ప్రస్తుతం క్యారెక్టర్ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.పెళ్లి తరువాత కేవలం క్యారెక్టర్ పాత్రలకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఈ బ్యూటీ, ఆ తరువాత దొరికిన ప్రతి పాత్ర చేసేందుకు రెడీ అయ్యింది.
ఈ క్రమంలోనే తాజాగా ఓ యంగ్ హీరో నటిస్తున్న చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు భూమికా రెడీ అయ్యింది.అయితే తొలుత ఈ సినిమాలో సదరు పాత్ర చేసేందుకు వేరే బ్యూటీని సెలెక్ట్ చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

యువ హీరో సముంత్ అశ్విన్ నటిస్తున్న తాజా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించేందుకు అనసూయ భరద్వాజ్‌ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.అయితే కొన్ని కారణాల వల్ల ఆమెను ఈ సినిమా నుండి తప్పించి, ఆ పాత్రను భూమికాతో చేయిస్తున్నారు.

TeluguStop.com - కుర్ర హీరో సినిమాలో భూమిక ఏం చేస్తుందంటే-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక తాజాగా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్న ఆమె చాలా గ్యాప్ తరువాత షూటింగ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని అంటోంది.

శ్రీకాంత్, భూమికా, సుమంత్ అశ్విన్, తాన్యా హోప్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను గురు పవన్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్నాడు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం పూర్తయ్యిందని, త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేస్తామని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ సినిమా రానుందని, ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఖచ్చితంగా ఆదరిస్తారని చిత్ర యూనిట్ తెలిపింది.

మరి ఈ సినిమాలో భూమికా చేయబోయే పాత్ర ఎలా ఉంటుందనే విషయం తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

#Sumanth Ashwin #Bhumika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bhumika Key Role In Sumanth Ashwin Movie Related Telugu News,Photos/Pics,Images..