బిగ్ బాస్ షోకు భూమిక.. క్లారిటీ ఇచ్చిన నటి!

టాలీవుడ్ స్టార్ నటి ముంబై బ్యూటీ భూమిక చావ్లా.ఎన్నో సినిమాలో స్టార్ హీరోలతో నటించిన భూమిక టాలీవుడ్ లో తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది.అంతేకాకుండా తమిళం, హిందీ సినిమాలలో కూడా నటించింది.తన నటనతో ఎన్నో అవకాశాలు అందుకుంది.ఇప్పటికీ పలు సినిమాలలో సహాయ పాత్రలలో కూడా నటిస్తుంది.ఇక సోషల్ మీడియాలో కూడా భూమిక బాగా యాక్టివ్ గా ఉంటుంది.
యువకుడు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తొలిసారి నటనతోనే మంచి గుర్తింపు అందుకని ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.తన పాత్రలతో బాగా మెప్పించింది.

 Actress Bhoomika Comments On Hindi Bigg Boss Show, Hindi Bigg Boss Show, Bhoomik-TeluguStop.com

ఇక చివరగా 2019లో విడుదలైన రూలర్ సినిమాలో నటించింది.ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఆఫర్ పై క్లారిటీ ఇచ్చేసింది భూమిక.

ఇక బాలీవుడ్ లో కూడా సహాయ పాత్రలలోనే మెప్పిస్తుంది.ఇక సోషల్ మీడియాలో ఈ మధ్య యాక్టివ్ గా మారిన భూమిక తన ఫోటోలతో నెట్టింట్లో షేక్ చేస్తుంది.

ఇటీవలే భూమిక కు హిందీ బిగ్ బాస్ సీజన్ 15 లో అవకాశం వచ్చిందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ విషయం గురించి స్పందించిన భూమిక.

ఇదిఫేక్ న్యూస్ అని పుకార్లను తోసిపుచ్చింది.
తనకు గతంలో సీజన్ 1,2,3 లలో అవకాశాలు వచ్చాయని కానీ తాను ఒప్పుకోలేదని తెలిపింది.

ఆ తర్వాత కూడా సంప్రదించగా తనకు ఆసక్తి లేదని తెలిపిందట.ఇక ఈ సారి తనకు ఎటువంటి అవకాశం రాలేదని, ఎవరు కూడా తనను సంప్రదించలేదని తెలిపింది.

ఒకవేళ అవకాశం వచ్చినా కూడా తాను ముమ్మాటికి ఒప్పుకొనని తెలిపింది.
తను పబ్లిక్ పర్సన్ అయినా.

తన లైఫ్ విషయంలో ప్రైవేట్ అని తెలిపింది.తనకు 24 గంటలు కెమెరాలలో ఉండటం ఇష్టముండదని క్లారిటీ ఇచ్చింది.

ఇక ఈ మధ్య కాలంలో హిందీ బిగ్ బాస్ షో లో మాత్రం తరచుగా గొడవలు, రొమాన్స్ లు ఎక్కువయ్యాయని తెలిపింది.సౌత్ బిగ్ బాస్ తో పోలిస్తే హిందీ బిగ్ బాస్ లో వ్యవహారాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసింది.

అందుకే చాలా మంది సెలబ్రెటీలు ఇందులో పాల్గొనడానికి ఆలోచిస్తున్నారని పైగా తన వ్యక్తిగత విషయాలను కూడా బయట పెట్టడం నచ్చదని మనసులో మాటలు చెప్పేసింది భూమిక.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube