అందంలో అక్కకి పోటీ ఇస్తున్న చెల్లి... కానీ హీరోయిన్ కాదు

బాలీవుడ్ లో అందంతో కంటే అభినయంతో ముందుగా ప్రూవ్ చేసుకొని తరువాత అందంతో కూడా అందరిని ఆకర్షించే నటీమణులు చాలా తక్కువ మంది ఉంటారు.అలాంటి వారిలో భూమి ఫేడ్నేకర్ ఒకరు.

 Bhumi Pednekar Sister Samiksha Pednekar Look Like Same, Tollywood, Bollywood, Bo-TeluguStop.com

ఈ భామ మొదటి సినిమాలోనే లావుగా ఉన్న అమ్మాయి పాత్రలో కనిపించింది.పాత్ర సభావం బట్టి లావుగా ఉండాలని బొద్దుగా తయారై నటించింది.

ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో భూమికి మంచి గుర్తింపు వచ్చింది.తరువాత బాగా స్లిమ్ అయ్యి రెగ్యులర్ హీరోయిన్స్ తరహాలో గ్లామర్ తో అందరిని మెస్మరైజ్ చేసింది.

దీంతో భూమికి బాలీవుడ్ లో దర్శకుల నుంచి బాగానే అవకాశాలు వస్తున్నాయి.ప్రస్తుతం ఈ భామ అనుష్క బాగమతి రీమేక్ గా తెరకెక్కిన దుర్గామతి సినిమాలో నటించింది.

ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే భూమి ఫేడ్నేకర్ కి ఒక ట్విన్ సిస్టర్ కూడా ఉంది.

ఇప్పుడు ఈ ట్విన్ సిస్టర్ భూమితో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది.

భూమి చెల్లి సమీక్ష పేడ్నేకర్‍ కూడా అచ్చం అక్క రూపంలోనే ఉంటుంది.అక్కకి ఏ మాత్రం తీసిపోని రీతిలో ఆమె అందం ఉంటుంది.

అయితే భూమి తరహాలో ఆమె సినిమా కెరియర్ ఎంచుకోలేదు.లా చదివి లాయర్‍గా రాణిస్తోంది.

అయితే అంద చందాల విషయంలో అక్కాచెల్లెళ్లు ఒకరితో ఒకరు పోటీపడుతున్నట్లు ఉన్న ఈ ఫోటోలని భూమి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.దీంతో బాలీవుడ్ దర్శక, నిర్మాతల కళ్ళు భూమి సిస్టర్ మీద పడ్డాయని ఇప్పుడు బిటౌన్ లో వినిపిస్తుంది.

మరి అక్క ఇన్స్పిరేషన్ తో ఎవరైన దర్శకుడు ఆఫర్ ఇస్తే సమీక్ష కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube