చంచల్ గూడ జైలుకు అఖిలప్రియ..!!  

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం గా కొనసాగుతోంది అంటూ సీపీ అంజనీ కుమార్ వివరించారు.ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా టిడిపి పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియా పేరు రావడంతో .

TeluguStop.com - Bhuma Akhilapriya To Chanchalguda Jail

రెండు తెలుగు రాష్ట్రాలలో బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించింది.కాగా ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న భూమా అఖిలప్రియ ని పోలీసులు కస్టడీలోకి దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఇటీవల కోర్టు కూడా మూడు రోజుల పాటు కస్టడీకి అఖిల ప్రియ ని అప్పగించడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ కేసు గురించి సీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ విచారణలో వచ్చిన వాస్తవాలు, టెక్నికల్ ఎవిడెన్స్ లను న్యాయస్థానం ముందు ఉంచుతామని తెలిపారు.

TeluguStop.com - చంచల్ గూడ జైలుకు అఖిలప్రియ..-Political-Telugu Tollywood Photo Image

ఈ కేసులో మిగతా నిందితులను రెండు రోజుల్లో పట్టుకుంటామని పేర్కొన్నారు.అఖిల ప్రియాకి  కస్టడీ పూర్తి అయిన తర్వాత చంచల్ గూడ జైలుకు పంపిస్తాం అని స్పష్టం చేశారు.

కాగా ఈ కేసు ను బట్టి రాజకీయంగా భూమా అఖిలప్రియ కెరీర్ కి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.చాలావరకూ టెక్నికల్ ఎవిడెన్స్ తెలంగాణ పోలీసులు రాబట్టినట్లు.

దీంతో ఈ కేసులో అఖిలప్రియ బయటపడటం కష్టమే అన్నట్లు రెండు తెలుగు రాజకీయా వర్గలలో టాక్ నడుస్తోంది.ఏది ఏమైనా కస్టడీ తర్వాత అఖిలప్రియ ని చంచల్ గూడ జైలుకు పంపిస్తాం అని సీపీ అంజనీ కుమార్ తెలపడంతో భూమా అఖిలప్రియ వర్గానికి చెందిన వారు ఆందోళన చెందుతున్నారు.

 

#BoinpalliKidnap

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bhuma Akhilapriya To Chanchalguda Jail Related Telugu News,Photos/Pics,Images..