మంచు మనోజ్ విష్ణు గొడవలపై స్పందించిన భూమా అఖిలప్రియ... ఏమన్నారంటే?

సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ( Manchu Family )కి ఎంతో మంచి క్రేజ్ పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.అయితే గత కొంతకాలంగా ఈ ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

 Bhuma Akhilapriya Reacts To Manchu Manoj Vishnus Quarrels What Does She Say , A-TeluguStop.com

ఈ వార్తలకు అనుగుణంగానే మంచు హీరోల వ్యవహార శైలి ఉండడంతో ఈ విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి.ఇందుకు అనుగుణంగానే తాజాగా మనోజ్( Manoj ) విష్ణు(Vishnu) గొడవ పడడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.

ఇక మనోజ్ విష్ణు గొడవకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇంటి గుట్ట మొత్తం బయటపడింది.

ఇలా వీరిద్దరూ ఒకరిపై ఒకరు దూషించకుంటూ కొట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యారు అంటే వీరి మధ్య పెద్ద ఎత్తున విభేదాలు తలెత్తాయని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ ఘటనపై స్పందించిన మంచు ఫ్యామిలీ అదేమీ పెద్ద గొడవ కాదని దానిని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు అంటూ కొట్టి పారేశారు.ఇప్పటికే ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ స్పందించారు.

అయితే తాజాగా భూమా మౌనిక(Bhuma Mounika) సోదరి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ( Akhila Priya ) సైతం ఈ వివాదం పై స్పందించారు.

తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న భూమా అఖిల ప్రియను మీడియా ప్రతినిధులు పలు విషయాల గురించి ప్రశ్నించారు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి మారుతున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోని మీడియా ప్రతినిధులు భూమా అఖిలప్రియను ప్రశ్నిస్తూ మీరు కూడా పార్టీ మారే ఆలోచనలు ఉన్నారా అంటూ ప్రశ్నించారు ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను తెలుగుదేశం పార్టీను( TDP ) వీడేదిలేదు అంటూ సమాధానం తెలియజేశారు.అలాగే మనోజ్ విష్ణు( Manoj ) గొడవ గురించి ఏమైనా ప్రశ్నించడంతో ఈమె సమాధానం చెబుతూ ఆ గొడవ పూర్తిగా వారి ఫ్యామిలీకి సంబంధించింది.ఈ విషయం వారిని అడిగితేనే బాగుంటుంది అంటూ సమాధానం చెప్పారు.

ఇలా అఖిల ప్రియ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube