చంద్రబాబు ని లెక్క చేయని అఖిల..వైసీపిలోకి జంప్       2018-04-26   02:10:28  IST  Bhanu C

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో కర్నూలు జిల్లాలో టీడీపీ నేతల మధ్య జరుగుతున్న గొడవలు చంద్రబాబుని ఇరకాటంలో పడేస్తున్నాయి..గత కొంతకాలంగా ఆళ్లగడ్డ లో భూమా అఖిల ప్రియకి , ఏవీ సుబ్బారెడ్డి కి మధ్య జరుగుతున్న గొడవలు పతాక స్థాయికి వెళ్ళిపోయాయి..,మొన్న జరిగిన రాళ్ళ దాడికి సంభందించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఆళ్ళ గడ్డ ఉపఎన్నికల సమయం నుంచీ వీరి మధ్య ఈ పోరు సాగుతున్నా గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు టీడీపీ పరువుని బజారుకు ఈడ్చుతున్నాయి.

అయితే ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు ఈ వ్యవహారంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి భూమా అఖిలప్రియను, ఆమె ప్రత్యర్దిగా ఉన్న ఎవి సుబ్బారెడ్డిని రావాలని ఆదేశించారు… .సాక్షాత్తూ సీఎంతో మీటింగ్ ఉన్నా.. తాను వచ్చేది లేదంటూ సంకేతాలిచ్చారుఏపీ మంత్రి అఖిలప్రియ ఏకంగా సీఎం చంద్రబాబుపైనే ధిక్కారం ప్రకటిస్తున్నారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన రాళ్ల దాడి విషయంలో ఆమె ఎంతో పట్టుదలతో ఉన్నారని తెలుస్తోంది.

ఇదిలాఉంటే చంద్రబాబు ఇద్దరికీ పులుపు ఇవ్వగా ఏవీ సుబ్బారెడ్డి మాత్రమే హాజరయ్యారు తప్ప అఖిల ప్రియ నన్ను ఎవరూ పిలవలేదు అని చెప్పేశారు.. కానీ టీడీపీ వర్గాలు మాత్రం తాము సమాచరాం ఇచ్చామంటున్నాయి. ఇప్పుడు సీఎంతో సమావేశానికి అఖిలప్రియ డుమ్మా కొట్టడం ఎన్నో సందేహాలని కారణం అవుతోంది..అనేక సందేహాలకు తావిస్తోంది. నిజంగానే పిలుపు రాలేదా? లేక కావాలనే ఆమె హాజరుకాలేదా అన్న అంశంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి.

ఇదిలాఉంటే అఖిల ప్రియ చంద్రబాబు కి ,తెలుగుదేశం పార్టీ కి ఓ దణ్ణం పెట్టి వదిలి వెళ్ళిపోనున్నారు అని తెలుస్తోంది.. అంతేకాదు ఇప్పటికే జగన్ మొహన్ రెడ్డి తో అఖిల ప్రియ అన్ని విషయాలు మాట్లాడిందని త్వరలోనే ఆమె పార్టీని వీడి జగన్ పంచన చేరుతారని తెలుస్తోంది…ఇదే గనుకా జరిగితే మళ్ళీ ఆళ్లగడ్డలో రాజకీయాలో మరో మారు వేడెక్కడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు అయితే ఈ మధ్య కాలంలో భూమా సెంటిమెంట్ తగ్గిందని దానికి కారణం అఖిల ప్రియ ఎమ్మెల్యే గా మంత్రిగా ఫెయిల్ అవ్వడమే అంటున్నారు..మరి అఖిల ప్రియ చివరకి ఎలాంటి దిశగా అడుగులు వేస్తుందో త్వరలో తేలనుంది అంటున్నారు కర్నూలు జిల్లా నేతలు.