టీడీపీకి “భూమా” అఖిల ప్రియ ఝలక్...వైసీపిలోకి..?   Bhuma Akhil Priya To Join In YSRCP Again     2018-04-08   01:58:33  IST  Bhanu C

దివంగత నేత భూమానాగిరెడ్డి దంపతుల కుమార్తె..ఏపీ పర్యాటక శాఖామంత్రి భుమా అఖిల ప్రియ తెలుగుదేశం పార్టీని వీదనున్నారా ..? గత కొంతకాలంగా నంద్యాలలో రాజకీయాలు అఖిల ప్రియని టిడిపికి దూరం చేయనున్నాయా..? ఏ పార్టీ ని అయితే వీడి అఖిల ప్రియ టిడిపిలోకి వచ్చారో అదే పార్టీ వైసీపి లోకి వేల్లనున్నారా అంటే అవుననే అంటున్నారు అఖిల ప్రియ సన్నిహిత వర్గాలు..అయితే గతంలో కూడా ఇలాంటి వార్తలే వచ్చినా సరే భూమా మార్పు ఏమి జరగలేదు సరికదా అఖిల ప్రియ ఈ వ్యాఖ్యలని కొట్టి పారేశారు అయితే ఈ సారి మాత్రం అఖిల ప్రియ ఖచ్చితంగా పార్టీ మారనున్నారని అంటున్నారు..మంత్రిగా ఉన్న అఖిల ప్రియ పార్టీ ఎందుకు మారాలని అనుకుంటున్నారు..? అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది..?

నంద్యాలలో గెలుపు తరువాత రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి..అఖిల ప్రియ హవా ఉపఎన్నిక విజయంతో మరింతగా పెరిగిపోయింది..అయితే ప్రతీ వ్యక్తికీ రాజకీయ ప్రత్యర్ధులు ఉండటం సహజం కానీ ఇక్కడ అఖిల ప్రియకి ఇంటి పోరు బయటి పోరు రెండు ఉన్నాయి..తన తండ్రికి ఎంతో సన్నిహితుడు అయిన ఎ.వి.సుబ్బారెడ్డి ఆమెను అన్ని విధాలుగా తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ..అఖిల ప్రియకి తెలనెప్పులు సృష్టిసున్నాడట..ఉపఎన్నికల్లో తనకి సీటు ఇవ్వాలని చంద్రబాబు కి విన్నవించుకున్నా సరే భూమా ఫ్యామిలీ వైపు చంద్రబాబు మొగ్గు చూపారు..అయితే ఆ పరిణామాలతో ఒక్క సారిగా షాక్ అయిన ఏవీ వైసీపిలోకి వెళ్ళాలని భావించారు దాంతో చంద్రబాబు నచ్చజెప్పడంతో వెనకడుగు వేశారు…చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో టిక్కెటు ఇస్తానని హామీ ఇవ్వడంతో ఇప్పుడు భూమా అఖిల ప్రియని ఏవీ టార్గెట్ చేస్తూ ఇబ్బందులకి గురిచేస్తున్నాడు అని టాక్ వినిపిస్తోంది..

అయితే ఈ మధ్య కాలంలో జరిగిన “భూమానాగిరెడ్డి” వర్థంతి సభలో ఏవీ ప్రవర్తించిన తీరు అఖిల ప్రియని ఎన్నో ఇబ్బందులకి గురిచేసిందట…కొంత మంది గుంట నక్కలు తమ తండ్రిపేరు చెప్పుకుని హడావుడి చేస్తున్నారని..వీరి సంగతి త్వరలోనే తేలుస్తానని..మంత్రి వ్యాఖ్యానించగా…దానికి కౌంటర్‌గా ‘ఎ.వి’ కూడా అదే రీతిలో స్పందించారట. తాను మొదటి నుంచి ‘భూమా’ అనుచరుడినని…తనను ఎవరూ ఏమి చేయలేరని వ్యాఖ్యానిస్తూ…సంచలనం సృష్టిస్తున్నారు…ఇదిలాఉంటే ఏవీ ఎవరి అండ చూసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో అంతుబట్టడం లేదు అంటున్నారు..అయితే ఈ విషయంపై అఖిల ప్రియ ఫైర్ అవుతున్నారట టిడిపి పెద్దలు ఏవీ ని కంట్రోల్ చేయకపోతే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండనే టాక్ వినిపిస్తోంది..అంతేకాదు ఇప్పటికే అఖిల ప్రియ వైసీపి కీలక నేతలతో మాట్లాడారు అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి..ఏది ఏమైనా సరే ఇప్పటి పరిస్థితులలో ఎవరికీ అలక వచ్చినా సరే వారు వైసీపి వైపుకే చూడటంతో చంద్రబాబు కి పెద్ద చిక్కొచ్చి పడుతోంది అంటున్నారు..మరి చంద్రబాబు అఖిల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి..