వైసీపీ ఎమ్మెల్యే కి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి.. !  

Bhooma akhila Priya warning to Nandyala MLA Ravi Chandra Kishor Reddy, nandyal mla, ravi chandra kishore reddy, warning, bhooma nagi reddy, death, akhila priya, tdp - Telugu Akila Priya, Bhooma Nagi Reddy, Death, Nandyal Mla, Ravi Kishore Reddy, Tdp, Warning

ఈ మధ్యకాలంలో కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో న్యాయవాది, అలాగే వైసిపి నేత అయిన సుబ్బరాయుడుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు.అయితే ఉదయం పూట వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఆయనను కర్రలతో కొట్టి దారుణంగా చంపినట్లు పోలీసులు నిర్ధారించారు.

TeluguStop.com - Bhooma Akhila Priya Warns Nandyala Mla Ravi Chandra Kishor Reddy

ప్రస్తుతం ఈ విషయం సంబంధించి పోలీసులు నిందితులను పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నారు.ఇక ఈ హత్య కేసు రాజకీయపరంగా దుమారం రేపుతోంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఆంధ్రప్రదేశ్ లోని గత ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన భూమా అఖిల ప్రియా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర రెడ్డిపై సవాల్ విసిరారు.

TeluguStop.com - వైసీపీ ఎమ్మెల్యే కి వార్నింగ్ ఇచ్చిన మాజీ మంత్రి.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సదరు సుబ్బరాయుడు హత్య కేసులో భూమా కుటుంబానికి సంబంధం ఉందని వారం రోజులలో నిరూపించాలని ఆవిడ ఎమ్మెల్యే పై సవాల్ విసిరారు.ఒకవేళ సంబంధం ఉన్నట్లుగా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతాను అన్నట్లు తెలిపింది భూమా అఖిలప్రియ.

అలా కానీ సమయంలో తమపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఉంటె వాటిని విడిచిపెట్టమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు కనబడుతోంది.అంతేకాకుండా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని అఖిల ప్రియ వార్నింగ్ ఇచ్చింది.

నంద్యాల నియోజకవర్గంలో ఏవిధమైన సంఘ విద్రోహ చర్యలు జరిగినా అది భూమా కుటుంబానికి సంబంధించి బురద చల్లుతున్నట్లు ఆవిడ వాపోయారు.

ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పుట్టక ముందే తన తండ్రి భూమా నాగిరెడ్డి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నట్టు ఆవిడ తెలిపింది.

అంతే కాదని తన తండ్రి మీద కొందరు కేసులు పెట్టి ఎన్నో విధాలుగా హింసించారని ఆవిడ గుర్తుచేసింది.ఏది ఏమైనా ప్రభుత్వంలో ఉన్న ఓ ఎమ్మెల్యేపై ఇంతలా నోరు చేసుకోవడం భూమా అఖిలప్రియకు ఎంత వరకు సబబో ఆలోచించుకోవాలి.

#Death #Warning #Akila Priya #Nandyal Mla

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bhooma Akhila Priya Warns Nandyala Mla Ravi Chandra Kishor Reddy Related Telugu News,Photos/Pics,Images..